వైసీపీ దురాగతాలను తిప్పికొట్టాలి

ABN , First Publish Date - 2023-09-25T22:53:06+05:30 IST

వైసీపీ దురాగతాలపై ప్రజలందరూ ఏకమై తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో జరుగుతున్న రిలే దీక్షలు సోమవారం 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో పీసీపల్లి మండల నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైసీపీ దురాగతాలను తిప్పికొట్టాలి
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

ప్రజలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర పిలుపు

13వ రోజు దీక్షలో సంకెళ్లతో నిరసన తెలిపిన టీడీపీ నేతలు

కనిగిరి, సెప్టెంబరు 25 : వైసీపీ దురాగతాలపై ప్రజలందరూ ఏకమై తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో జరుగుతున్న రిలే దీక్షలు సోమవారం 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో పీసీపల్లి మండల నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేతులకు సంకెళ్లు వేసుకొని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ వైసీపీ అరాచకాలు, పాలనా వైఫల్యాలను ప్రశ్నించే వారిపై దాడులు, అక్రమ కేసులతో భయపెడుతోందన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్యానికి జగన్‌రెడ్డి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేయడం అన్యాయమని, అందుకు తగిన మూల్యాన్ని వైసీపీ పాలకులు చెల్లించుకోకతప్పదన్నారు. జగన్‌రెడ్డి నియంత పాలనపై ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఉగ్ర పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టును వైసీపీ నాయకులే తప్పుబడుతున్నారని అన్నారు. రాష్ట్రంతోపాటు దేశ విదేశాల్లో తెలుగువాళ్లంతా బాబు అరెస్టును ముక్తకంఠంతో ఖండిస్తున్నా జగన్‌రెడ్డి పట్టించుకోకపోగా రాక్షసానందాన్ని పొందుతున్నారని అన్నారు. ప్రజలంతా ఐక్యతతో ఉంటే దేనినైనా సాధించగలరన్నది జగన్‌రెడ్డికి చూపించాలన్నారు. నియంతలే ప్రజల వద్ద తలదించుకున్న ఘటనలు మర్చిపోరాదని ఉగ్ర వైసీపీ పాలకులనుద్దేశించి అన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడి జగన్‌రెడ్డి జైలుకెళ్లినప్పుడే ఏ ఒక్కరూ ఆయన కోసం రోడ్డెక్కలేదన్నారు. నేడు చంద్రబాబు కోసం అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా రోడ్డుపైకి రావడం ఆయన చేసిన సంక్షేమానికి ఇచ్చిన గౌరవంగా పేర్కొన్నారు. అధికారమదంతో రెచ్చిపోతున్న వైసీపీ పాలకులకు రానున్న రోజుల్లో ప్రజలు గట్టి బుద్ధి చెప్తారని ఉగ్ర అన్నారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌చార్జి దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, కనిగిరి, హనుమంతునిపాడు, పీసీపల్లి మండల పార్టీ నాయకులు నంబుల వెంకటేశ్వర్లుయాదవ్‌, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, హనుమంతునిపాడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, వేమూరి రామయ్య పీసీపల్లి నాయకులు గుంటగాని జోసెఫ్‌, గోపిరెడ్డి నరసింహారెడ్డి, వీరపనేని పెద్దన్న, ములకా నాగేశ్వరరావు, ముప్పూరి మాల్యాద్రి, కరణం గంగయ్య, అంజయ్య, రత్తయ్య, అంకయ్య, యర్రంరెడ్డి, బ్రహ్మారెడ్డి, వెంకటరావు, వీరనారాయణ, మాలకొండయ్య, భీమయ్య పాల్గొన్నారు.

నిరసన దీక్షకు తరలిన మండల నాయకులు

పీసీపల్లి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కనిగిరి అమరావతి గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న నిరసన దీక్షకు టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు సోమవారం కనిగిరి తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే ఉగ్రతో కలిసి వారు దీక్షలో కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు గడ్డం బాలసుబ్బయ్య, మండల అధ్యక్షుడు వేమూరి రా మయ్య మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని అటకెక్కించిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలవుతుందని వారన్నారు. బాబు అరెస్టును ప్రతి ఒ క్కరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నల్లపనేని రత్తయ్య, వీరపనేని పెద్దన్న, ఏనుగంటి శ్రీను, సోమయ్య, గోనుగుంట్ల చెన్నయ్య, గడ్డం వి ష్ణు, నాగోతు శ్రీను, చంద్రయ్య, నెలకుర్తి మాలకొండయ్య, ములకా నాగేశ్వరరా వు, మారెళ్ల మాలకొండయ్య, చెన్నుపాటి అంజయ్య, చలంచర్ల యోగయ్య, త లకొండపాడు గ్రామ కమిటీ అధ్యక్షుడు నెలకుర్తి మాల్యాద్రి, గోపిరెడ్డి నరసింహారెడ్డి, బీసీసెల్‌ నాయకులు పెదబ్రహ్మయ్య, నేరేడుపల్లి సర్పంచ్‌ పల్లా మల్లికార్జున్‌, కరణం గంగయ్య, మడతల కృష్ణారెడ్డి, మోతుకూరి శ్రీను, వెంకట్రావు, నరసింహారావు, భీమయ్య, రమణారెడ్డి, కరణం గంగయ్య, ముప్పవరపు మాచ ర్లు, వేమూరి సుబ్బరాయుడు, వెంకట్రావు, మూలె పుల్లారెడ్డి పాల్గొన్నారు.

వైసీపీ పాలకులు మూల్యం చెల్లించుకోకతప్పదు

దర్శి : మాజీ సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినందుకు వైసీ పీ పాలకులంతా మూల్యం చెల్లించుకోకతప్పదని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు స్పష్టం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన ఆందోళనల్లో భాగంగా సోమవారం కూడా రిలే దీక్ష కొనసాగింది. పాపారావు మాట్లాడుతూ చంద్రబాబుకు మద్దతుగా రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం కావటంతో వైసీపీ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు. ప్రజల దీవెనెతో అతి త్వరలోనే చంద్రబాబు అక్రమ కేసుల మచ్చ అంటకుండా బయటకు వస్తారని అన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్‌ చైర్మన్‌ తలారి కోటయ్య, మండల టీడీపీ అధ్యక్షుడు చిట్టె వెంకటేశ్వర్లు, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షుడు యాదగిరి వాసు, దర్శి క్లస్టర్‌ ఇన్‌చార్జి నారపుశెట్టి మధు, నాయకులు సంగా తిరుపతిరావు, జూపల్లి కోటేశ్వరరావు, శోభారాణి, సైదారావు, లక్ష్మీనారాయణ, వెలిగొండ రెడ్డి, అంకయ్య, శ్రీనివాసరెడ్డి, రామిరెడ్డి పాల్గొన్నారు.

ఊపందుకున్న పోస్టు కార్డు ఉద్యమం

దొనకొండ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన గా గ్రామాల్లో పోస్టు కార్డు ఉద్యమం ఊపందుకుంది. టీడీపీ మండల అధ్యక్షు డు నాగులపాటి శివకోటేశ్వరరావు నేతృత్వంలో బాబుతో నేను పేరిట మూ డు రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు మండలంలోని గ్రామాల నుంచి పోస్టుకార్డులు పంపుతున్నారు. బాబుకు అండగా ఉంటామని ప్రజలు స్వ చ్ఛందంగా పోస్టుకార్డు ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 1500 పోస్టు కార్డులు రాజమండ్రికి పంపించామని శివకోటేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చేతకాని జగన్‌రెడ్డి ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు, భౌతిక దాడులు చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీ డీపీ మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు మోడి ఆంజనేయులు, పట్టణ పార్టీ అ ధ్యక్షుడు షేక్‌ తోహిద్‌, టీడీపీ మండల కార్యదరి సుబ్బారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T22:53:06+05:30 IST