మహిళా సాధికారతకు కృషి

ABN , First Publish Date - 2023-03-26T00:49:41+05:30 IST

స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాఽధికారత సాధించేలా ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటున్నదని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు.

మహిళా సాధికారతకు కృషి

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 25 : స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాఽధికారత సాధించేలా ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటున్నదని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. ఆసరా పథకంలో భాగంగా అర్హుల బ్యాంకు ఖాతాలలో నేరుగా రుణమాఫీ మూడో విడత నిధుల జమచేసే రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాశం భవన్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 36,769 స్వయం సహాయ సంఘాల్లోని 3,59,506 మంది సభ్యులకు రూ.280.50 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం మహిళలకు జడ్పీ చైర్‌పర్సన్‌తో కలిసి కలెక్టర్‌ నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ బాబూరావు, మెప్మా పీడీ రవికుమార్‌, ఎల్‌డీఎం యుగంధర్‌తోపాటు మేయర్‌ గంగాడ సుజాత పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:49:41+05:30 IST