టీడీపీ విజయానికి కృషి చేయండి

ABN , First Publish Date - 2023-03-02T22:25:35+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో జైత్రయాత్ర ఆరంభం అవుతుం దని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ ధీమా వ్యక్తం చేశా రు. ఎన్నికల ప్రచారంలో బాగంగా దర్శి పట్ట ణంలోని పలు కళాశాలల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం పీజీఎన్‌ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మాట్లాడు తూ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా తమ విజయానికి కృషి చేయాలని కోరారు.

టీడీపీ విజయానికి కృషి చేయండి
టీడీపీ విజయానికి కృషి చేయండి

ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌

దర్శి, మార్చి 2 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో జైత్రయాత్ర ఆరంభం అవుతుం దని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ ధీమా వ్యక్తం చేశా రు. ఎన్నికల ప్రచారంలో బాగంగా దర్శి పట్ట ణంలోని పలు కళాశాలల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం పీజీఎన్‌ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మాట్లాడు తూ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా తమ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపా రావు, టీడీపీ ఎన్నికల పరిశీలకులు నల్లపాటి రామచంద్రాప్రసాద్‌, నగర పంచాయతీ చైర్మ న్‌నారపుశెట్టి పిచ్చయ్య, వైస్‌ చైర్మెన్‌జీ స్టీవెన్‌, టీడీపీ పట్టణాధ్యక్షుడు యాదగిరి వాసు, దర్శి, కురిచేడు, దొనకొండ, తాళ్ళూరు, ముండ్ల మూరు మండలాలకు చెందిన టీడీపీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైసీపీకి ఈ ఎన్నికలు

గుణపాఠం కావాలి

పామూరు, మార్చి 2 : ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి గుణపాఠం కావాలని, వారిని చిత్తుగా ఓడించినపుడే అరాచక పాలన నుంచి విముక్తి లభిస్తుందని టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ మాజీ స భ్యుడు బొల్లా మాల్యాద్రి చౌదరి అన్నారు. ఎ మ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప ట్టణంలో గురువారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా పలువురు పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయులను కలిసి కరపత్రాలను పంపిణీ చేశారు. తూర్పురాయలసీమ పట్టభద్రుల శాసన మండలి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌కు మొదటి ప్రాధాన్యతా ఓటను వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, సయ్యద్‌ అమీర్‌బాబు, షేక్‌ ఖాజారహంతుల్లా ఇర్రికోటిరెడ్డి, పులి నాయభ, షేక్‌ గౌస్‌బాషా, దేవరపు మాల్యాద్రి, గుంటుపల్లి శ్రీనివాసులు, పత్తుమస్తాన్‌ , రుసుం ఖాజామస్తాన్‌ సయ్యద్‌ ఖాదర్‌బాషా పాల్గొన్నారు.

టీడీపీతోనే యువతకు ఉద్యోగాలు

తెలుగు రైతు నాయకుడు రాచమల్ల

కనిగిరి, మార్చి 2 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన తెలుగు దేశం పార్టీతోనే సాధ్యమని తెలుగు రైతు రాష్ట్ర నాయకుడు రాచమల్ల శ్రీనివాసులరెడ్డి అన్నా రు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలల్లోని నిరుద్యోగులను కలిశారు. ఆ యన మాట్లాడుతూ వైసీపీ వచ్చాక ప్రతి జన వరిలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తామన్న జగన్‌రెడ్డి ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను మోసగించారన్నారు. రాష్ట్రాని కి ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోగా ఉన్నవి తరలిపోయేలా భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. అరాచకం, అవినీతి, దౌర ్జన్య పాలనతో రాష్ట్రాని అల్లకల్లోలం చేస్తు న్నార ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం లో అనేక కంపెనీలను తీసుకొచ్చి నిరు ద్యోగు లకు ఉపాధి అవకాశాలు కల్పించార న్నారు. టీడీపీ ప్రభుత్వంలో డీఎస్సీ నోటి ఫికేషన్‌వేసి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. 1999లో ఉద్యో గులకు 25 శాతం, 2014లో 43 శాతం ఫిట్‌ మెంట్‌ను ఉద్యోగులకు ఇచ్చింది టీడీపీయేన న్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు ఆలోచించి శాసన మండలిలో టీడీపీ బలపరిచిన కంచర్ల శ్రీకాం త్‌ను గెలిపించాలని కోరారు. ప్రతి ఇం టికీ తిరుగుతూ వైసీపీ ఉద్యోగ వ్యతిరేక విధానా లను చెప్తూనే టీడీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యక ర్తలు, శ్రేణులు పాల్గొన్నారు.

శ్రీకాంత్‌ విజయానికి సహకరించాలి

పీసీపల్లి : తూర్పు రాయలసీమ పట్ట భద్రుల స్థానానికి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంచర్ల శ్రీకాంత్‌ విజయానికి పట్టభద్రులు సహకారం అందించాలని టీడీపీ మండలాధ్యక్షుడు వేమూరి రామయ్య అన్నా రు. గుంటుపల్లి పంచాయతీలో గురువారం ఎ మ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలోని ఓటు హక్కు ఉన్న పట్టభద్రు లను కలిసిన టీడీపీ నాయకులు ఈ నెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతా ఓటును శ్రీకాంత్‌కు వేసి ఆయన గెలుపునకు తోడ్పడాలని వారు కోరారు. కార్యక్రమంలో ఏనుగంటి శ్రీను, కనపర్తి శాంసన్‌, కోమటి గుంట్ల వీరయ్య, మూలె వెంకటేశ్వ రరె డ్డి(సత్తిరెడ్డి), వెంకట కొండా రెడ్డి, పెద్దిరెడ్డి, మహేంద్రరెడ్డి, హజరత్‌, జోసెఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T22:25:35+05:30 IST