ఇచ్చిన మాట ఏమాయే..!
ABN , Publish Date - Dec 30 , 2023 | 02:05 AM
మాట తప్పను, మడమ తిప్పను అంటూ గత ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రచారం చేసుకొన్నాడని అంగన్‌వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు.
పెద్ద దోర్నాల, డిసెంబరు 29: మాట తప్పను, మడమ తిప్పను అంటూ గత ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రచారం చేసుకొన్నాడని అంగన్‌వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం తమకు రూ.26వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమడిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె శుక్రవారం 18 రోజూ స్థానిక ఆర్‌టీసీ బస్టాండు వద్ద శిబిరంలో కొనసాగింది. దోర్నాల, పెద్దారవీడు మండలా లకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. అనంతరం దోర్నాలలో భిక్షాటన చేశారు. శిబిరం వద్దే వంటవార్పు నిర్వహించారు. వీరికి సీఐటీయూ, టీడీపీ, రైతుసంఘాల నేతలు మద్దతు ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలని సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని హెచ్చ రించారు. కార్యక్రమంలో షేక్ ముంతాజ్‌బేగం, వెంకటరత్నం, సుబ్బమ్మ, వెంకటలక్ష్మీ, కోడి రాణి, సుహాసిని, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
కంభం : అంగన్‌వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యలు తీర్చని పక్షంలో రానున్న ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడిస్తామని, శాశ్వతంగా ప్రతిపక్షంలో జగన్మోహ న్‌రెడ్డిని కూర్చోబెడతామన్నారు. జీతాలు, గ్రాట్యూటీ, కల్పించాలని కోరుతూ కందులాపురం కూడలిలో చేపడు తున్న దీక్షకు ఏఐటీయూసీ అధ్యక్షులు ఇబ్రహీం, సీఐటీ యూ నాయకులు అన్వర్ మద్దతు తెలిపి మాట్లాడారు. దీక్షలో ప్రాణాలు పోయేంతవరకు పోరాడి హక్కులు సాదించుకుంటామన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర నుండి మేల్కొని తమ డిమాండ్లను పరిష్కరించాలన్నా రు. కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షురాలు సరళ, రాజేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి, శారద, సుబ్బమ్మ, మాధవి, మూడు మండలాల అంగన్‌వాడి కార్య కర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
మార్కాపురం వన్‌టౌన్ : సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదురు అంగన్ వాడీలు చేస్తున్న సమ్మెకు ఆటో యూనియన్ సంఘీభావం తెలిపింది. అంగన్‌వాడీలతో వెట్టి చాకిరి చేయించుకుంటోందన్నారు. తాము శాంతియుతంగా నిర సన చేపడు తుంటే అణచివేత చర్యలు చేపట్టడం దుర్మార్గమని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి అందె నాసరయ్య అన్నారు. అంగన్‌వాడీలు, ఆయాలు పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెంలో ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ రవీంద్ర శుక్రవారం కార్యకర్తలతో వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.4500 నుంచి రూ.10,500కు పెంచిదన్నారు. 18 రోజులు నుంచి కార్య కర్తలు సమ్మె చేస్తున్నా, ప్రభుత్వంలో చలనం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కార్యకర్తల వేతనం పెంపునకు కృషి చేస్తామన్నారు. ధర్నాకు సంఘీభావం తెలిపి రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. యూనియన్ అధ్యక్షురాలు మల్లేశ్వరి చేతుల మీదగా అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీచైర్మన్ చేకూరి ఆంజనేయులు, టీడీపీ రాష్ట్రమైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ జిలానీ, మండల మాజీ అధ్యక్షులు వూట సీతారామయ్య, వడ్లమూడి లింగయ్య, నాయకులు సంఘీబావం తెలిపారు.
మోకాళ్లపై నిలుచొని నిరసన
ఎర్రగొండపాలెంలో అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం మోకాళ్లపై నిలుచొని నిరసన తెలిపారు. తమ మొరను ఆలకించాలని ప్రభుత్వాన్ని చేతులు చూచి అర్తించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌్క్ష హెల్ప ర్స్ యూనియన్ నాయకులు జి.మల్లేశ్వరి, పి.సుబాషిణి,నాగరాజకుమారి, రామసుబ్బమ్మ, అరుణ, సునీత, తలపాటి సుబ్బమ్మ, సుజాత, విజయలక్ష్మి, రూత్‌మేరి, రామకుమారి, తిరుపాలమ్మ, పాల్గొన్నారు.
కొనసాగిన సమ్మె
గిద్దలూరు : డిమాండ్ల పరిష్కారం కోసం నిరవదిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు స్థానిక సచివాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. అంగన్‌వాడి కేంద్రాలు మూతపడ్డా, అర్హులకు పౌష్ఠికాహారం అందకపోయినా ప్రభుత్వం పట్టించుకోక పోవడం శోచనీయమని అంగన్‌వాడి వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు స్వర్ణకుమారి, మున్నా విమర్శించారు.