అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN , First Publish Date - 2023-05-26T00:02:32+05:30 IST
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాచిన కృష్ణచైతన్య అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని కొమ్మాలపాడులో ఆయన పర్యటించా రు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు అం దుతున్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు.

వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కృష్ణచైతన్య
సంతమాగులూరు, మే 25: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాచిన కృష్ణచైతన్య అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని కొమ్మాలపాడులో ఆయన పర్యటించా రు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు అం దుతున్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. కా ర్యక్రమంలో జడ్పీటీసీ అడవి శ్రీనివాసరావు, చింతా రా మారావు, నాగబోతు రామాంజనేయులు, సర్పంచ్, వ లంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని బం డివారిపాలెంకు చెందిన కొందరు టీడీపీ నుంచి వైసీ పీలోకి చేరారు. వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వా నించారు.
నేటి నుంచి పంగులూరులో ఖోఖో శిక్షణ
పంగులూరు, మే 25: పంగులూరులో శుక్రవారం సాయంత్రం క్రీడలశాఖా మంత్రి ఆర్‌కే రోజా ప్రారం భించనున్న రాష్ట్ర ఖోఖో పురుషుల జట్టు శిక్షణ శిబిర ఏర్పాట్లను కృష్ణచైతన్య గురువారం సాయంత్రం పరిశీలించారు. గోవాలో జరగనున్న 37వ జాతీయక్రీడల లో పాల్గొనే ఖోఖో రాష్ట్ర పురుషుల జ ట్టుకు పంగులూరు ఎంఎస్‌ఆర్. అండ్ బీఎన్‌ఎం జూనియర్ కళాశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ జిల్లా అ ధికారి జి.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ప్రారంభ ఏర్సాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమంలో ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం. శీతా రామిరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీని వాసరెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆర్వీ సుబ్బారావు, బ్రహ్మారెడ్డి, జిల్లా కార్యదర్శి కాశీవిశ్వనాధరెడ్డి, సర్పంచ్ గుడిపూడి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మరింత సేవలు అందించాలి
అద్దంకి, మే 25: ప్రజలకు మరింత సేవలు అందిం చాలని కృష్ణచైతన్య అన్నారు. అద్దంకి మున్సిపల్ పరిఽ దిలోని వలంటీర్‌లకు గురువారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురష్కారాలను శా ప్‌నెట్ చైర్మన్, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇంచార్జి బాచిన కృష్ణచైతన్య అందజేశారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్ పర్సన్ ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్‌లు పద్మేష్, అనంతలక్ష్మి, కమిషనర్ రవికుమార్, వైసీపీ పట్టణ అ ధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్, గూడా శ్రీనివాసరెడ్డి, పూనూరి నరేంద్ర, కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.