చంద్రబాబుతోనే సంక్షేమం, అభివృద్ధి

ABN , First Publish Date - 2023-06-26T00:43:12+05:30 IST

రాష్ట్రంలో సంక్షేమం, అభి వృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయడుతోనే సాధ్యమని ఆ పార్టీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జ్‌ గూడూ రి ఎరిక్షన్‌బాబు అన్నారు.

చంద్రబాబుతోనే సంక్షేమం, అభివృద్ధి

పెద్ద దోర్నాల, జూన్‌ 25: రాష్ట్రంలో సంక్షేమం, అభి వృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయడుతోనే సాధ్యమని ఆ పార్టీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జ్‌ గూడూ రి ఎరిక్షన్‌బాబు అన్నారు. ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ చేపట్టిన ‘చైతన్య రధయాత్ర’ ఆదివారం సాయంత్రం మండలంలోని చిన్నగుడిపాడు గ్రామానికి చేరుకొంది. అక్కడ ఏర్పా టు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఎరిక్షన్‌బాబు మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి రావడానికి మోసపు మాటలు చెప్పిందన్నారు. నవరత్నాలంటూ ప్రజలను ఏమార్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింద న్నారు. అనంతరం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిం దన్నారు. ఇక టీడీపీ మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను చూసి వైసీపీ పాలకుల్లో వణుకు ప్రారంభమైందన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అధికారం చేపట్టిన ఆరు నెలల్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేసి నీళ్లందించడం, మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించను న్నట్లు చంద్రబాబు ప్రకటించారన్నారు. ఈ ప్రాంతం మంత్రి నియోజకవర్గానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై నిత్యమూ దాడులు జరుగుతున్నాయ న్నా రు. అయినా ఉలుకూ పలుకూ లేని స్థానిక మంత్రి చొక్కా విప్పితే ప్రయోజనమేముంటుం దన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను గమనించాలన్నారు. ప్రధానంగా మహిళ లకు పెద్దపీట వేస్తూ ఆర్‌టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 సిలెండర్లు అందజేత, నెల నెలా కుటుంబంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఆడ బిడ్డకు రూ.1500లు బ్యాంకుల్లో జమ, రూ. 15,000లు ఆర్ధిక సహాయం, రైతులకు ఆర్ధిక తోడ్పాటు, నిరు ద్యోగులకు నెలకు రూ.3వేలు ప్రోత్సాహం వంటి బృహత్తర పథకాలు ప్రకటించడంతోనే ప్రజల్లో భరోసా కలిగిందన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్ధన్‌ మాట్లాడుతూ.., స్థానికంగా ఉండే చిన్నపాటి విభేదాలను కార్యకర్తలు ప్రజలు విడిచిపెట్టాలన్నారు. దేశంలోనే ఆదర్శ వంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే విజన్‌ ఉన్న చంద్రబాబును చూసి టీడీపీని భారీ మెజార్టీతో గెలి పించాలన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకో సీఎంను సాగనంపాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో కొండపి ఎమ్మెల్యే బాలవీ రాంజనేయస్వామి, ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజి, గిద్ద లూరు మాజీ ఎమ్యెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి, కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి, సత్యవీడు ఇంచార్జి హేమలత, వాణిజ్య శాఖ నాయకులు రాకేశ్‌, సీనియర్‌ నాయకు లు డాక్టర్‌ రవీంద్ర, మండల నాయకులు షేక్‌ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, షేక్‌ సమ్మద్‌భాష, దేసు నాగేంద్రబాబు, చంటి, షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ బాష కటికల శ్రీనివాసులు, ఎలకపాటి చెంచయ్య, కే.రాజేంద్ర, బట్టు సుధాకర్‌ రెడ్డి, ఏర్వ మల్లికార్జున రెడి, విష్ణువర్ధన్‌ రెడ్డ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజయ్య కుటుంబ సభ్యులకు సాయం అందజేత

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎర్రగొండపాలెం పర్యటన సందర్భంగా వైసీపీ నాయకులు చేసిన రాళ్లదాడిలో చిన్నగుడిపాడు వాసి చేదూరి రాజయ్య మృతి చెందాడు. ఈ క్రమంలో మృతుని కుటుంబసభ్యులకు టీడీపీ రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పల్లెనిద్ర సందర్భంగా ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు దామచర్ల జనార్ధన్‌, నూకసాని బాలజీ తదితరుల చేతుల మీదగా, రాజయ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా నగదును అందజేశారు.

చిన్నగుడిపాడులో పల్లెనిద్ర

చిన్నగుడిపాడులో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుండి పెద్ద ఎత్తున గాలివాన ప్రారంభమైంది. స్టేజికి కట్టిన బ్యానర్లు, గాలికి లేచిపోయాయి. ఒకానొక దశలో కార్యక్రమం రద్దయ్యే సూచనలు కనిపించాయి. వర్షం తగ్గడంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 6-30గం.లకు చైతన్య రధయాత్ర బస్సు చిన్నగుడిపాడు చేరుకుంది. దోర్నాల నుండి ముస్లిం మహిళలు అధికసంఖ్యల్లో పాల్గొన్నారు. చిరుజల్లులు కురుస్తున్నా కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2023-06-26T00:43:12+05:30 IST