Share News

అయ్యప్పస్వామికి వైభవంగా విలక్కి పూజ

ABN , First Publish Date - 2023-12-11T01:48:59+05:30 IST

స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం లో విలక్కి మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు.

అయ్యప్పస్వామికి వైభవంగా విలక్కి పూజ

మార్కాపురం వన్‌టౌన్‌, డిసెంబరు 10: స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం లో విలక్కి మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు రెంటచింతల రాఘవశర్మ, రాము, చంద్రశేఖరశర్మలు అయ్యప్ప స్వామి మూలవిరాట్‌కు ఉదయం సుప్రభాత సేవ, కలశ స్థాపన, అభిషేకాలు చేశా రు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. రాత్రి పులి వాహనంపై అయ్య ప్పస్వామికి నగరోత్సవం చేశారు. కేరళ వాయిద్యాలు, భాజభజంత్రీలు, అయ్యప్ప స్వాముల చిత్ర విచిత్ర వేషధారణలు, బాలికలు, మహిళలు దీపాలు పట్టుకొని నగరోత్సవంలో సాగారు. పి.ప్రశాంతకుమార్‌ స్వామిఅయ్యప్ప స్వామి అభిషేకాలకు విరాళాలు సమర్పించారు. అయ్యప్ప స్వామి సేవా సంఘం అధ్యక్షులు తాడువాయి గోపాల మల్లికార్జునరావు, కార్యదర్శి పడుచూరి కృష్ణయ్య, కోశాధికారి పువ్వాడ వెంకట సత్యమోహన్‌రావు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - 2023-12-11T01:49:01+05:30 IST