Share News

అక్కరకు రాని ఫీజు రాయితీ

ABN , First Publish Date - 2023-12-10T23:10:56+05:30 IST

జిల్లాలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతు న్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వి ద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన పరీక్ష ఫీజు రాయి తీ అక్కరకు రాకుండా పోయింది. సర్కారు విధించిన నిబంధనలతో ఒక్కరికి కూడా వర్తించకుండా పో యింది.

అక్కరకు రాని ఫీజు రాయితీ

ఒక్కరంటే ఒక్కరికీ వర్తించలేదు

రూ.25లక్షల లబ్ధిని కోల్పోయిన విద్యార్థులు

20 వేల మందికి నష్టం

ఒంగోలు (విద్య), డిసెంబరు 10 : జిల్లాలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతు న్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వి ద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన పరీక్ష ఫీజు రాయి తీ అక్కరకు రాకుండా పోయింది. సర్కారు విధించిన నిబంధనలతో ఒక్కరికి కూడా వర్తించకుండా పో యింది. జిల్లాలో సుమారు 20వేల మంది విద్యార్థులు ఫీజు రాయితీకి నోచుకోలేకపోయారు. దశాబ్దాల నాటి నిబఽంధనలు నేటికీ వర్తింపజేస్తుండటం ఇందుకు కారణమైంది. సుమారు రూ.25లక్షల మేర విద్యార్థులు కోల్పోయారు. జిల్లాలో 30వేల మంది వరకు విద్యార్థులు వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. రెగ్యులర్‌ మొదటిసారి పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రాయితీని ప్రకటించింది. ఈ మూడు వర్గాల విద్యార్థులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ రాయితీ పొందేందుకు విద్యార్థులకు దశాబ్దాల క్రితం నిబంధనలను పెట్టింది. ఈ వర్గాల విద్యార్థులకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తుండటంతో వీరికి పరీక్ష ఫీజు రాయితీ అందని ద్రాక్షలాగే మిగిలింది.

ఆదాయ ధ్రువీకరణ కష్టమే

ఆచరణ సాధ్యం కాని నిబంధనలతో విద్యార్థుల కుటుంబాలకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరుచేసేందుకు తహసీల్దార్లు ససేమిరా అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లో నివసించే వారైతే వార్షిక ఆదాయం రూ.24వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారైతే 2.5 ఎకరాల మాగాణి, ఐదు ఎకరాలలోపు మెట్ట భూమి ఉండి రూ.20వేలలోపు వార్షిక ఆదాయం ఉంటేనే పరీక్ష ఫీజు రాయితీ పొందేందుకు అర్హులు. అయితే ఆదాయ పరిమితికి లోబడి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు తహసీల్దార్లు ససేమిరా అంటున్నారు. కేవలం కూలినాలి చేసుకుని జీవించే వారికే ఏడాదికి లక్షల్లోనే ఆదాయం ఉంటోంది. అసలు పట్టణాల్లో ఏడాదికి రూ.24వేలు, గ్రామాల్లో రూ.20వేలలోపు వార్షిక ఆదాయంతో జీవించడం సాధ్యమేనా? నెలకు కనీసం రూ.10వేలు ఆదాయం కూడా లేకుండా కుటుంబపోషణ సాధ్యమా? అన్ని విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా విద్యాశాఖ అధికారులు విధించిన నిబంధనలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2023-12-10T23:10:58+05:30 IST