ఫాం 7లపై త్రిసభ్య కమిటీ విచారణ
ABN , Publish Date - Dec 18 , 2023 | 10:28 PM
టీడీపీ సానుభూతిపరుల ఓట్లే తొలగిస్తు న్నారని పలువురు పేర్కొన్నారు. మండలంలోని చింతగుంపల్లిలో ఫాం- 7లపై వచ్చిన 140 దరఖాస్తులపై సోమవారం త్రిసభ్య కమిటీ నేతృ త్వంలో విచారణ చేపట్టారు. గ్రామంలోని 264 పోలింగ్ స్టేషన్ పరిధిలో 69 ఓటర్లపై, 265 పోలింగ్ స్టేషన్ పరిధిలో 67 ఓటర్లపై ఫాం-7 దర ఖాస్తులు వచ్చినటు తహసీల్దార్ పాలపర్తి పార్వతి తెలిపారు.
ఓటర్ల ఇళ్లకు వెళ్లి పరిశీలన
హాజరుకాని దరఖాస్తుదారుడు
కావాలనే టీడీపీ సానుభూతిపరులవి
తొలగిస్తున్నారని అధికారుల నిలదీత
చినగంజాం, డిసెంబరు 18: టీడీపీ సానుభూతిపరుల ఓట్లే తొలగిస్తు న్నారని పలువురు పేర్కొన్నారు. మండలంలోని చింతగుంపల్లిలో ఫాం- 7లపై వచ్చిన 140 దరఖాస్తులపై సోమవారం త్రిసభ్య కమిటీ నేతృ త్వంలో విచారణ చేపట్టారు. గ్రామంలోని 264 పోలింగ్ స్టేషన్ పరిధిలో 69 ఓటర్లపై, 265 పోలింగ్ స్టేషన్ పరిధిలో 67 ఓటర్లపై ఫాం-7 దర ఖాస్తులు వచ్చినటు తహసీల్దార్ పాలపర్తి పార్వతి తెలిపారు. గ్రామాని కి చెందిన కాటుకూరి కిషోర్‌కుమార్ 140 ఓట్లను తొలగించాలని ఫాం- 7 దరఖాస్తులు సమర్పించినట్లు తెలిపారు. తహసీల్దార్ పి.పార్వతి, భూ రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ డి.శ్రీకాంత్, బీఎల్‌వో ఎన్.నాగరాజుల త్రిస భ్య కమిటీ నేతృత్వంలో ఫాం-7 దరఖాస్తులపై సోమవారం విచారణ చే శారు. సంబంధిత ఓటర్ల ఇళ్లకు వెళ్లి ధ్రువపత్రాలను పరిశీలించారు. వి చారణ సమయంలో ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేసిన వ్యక్తి హాజ రుకాలేదని తహసీల్దార్ తెలిపారు. ఇక్కడ పనులు లేని సమయంలో ఇతర గ్రామాలకు వెళ్లి పనులు చేసుకుంటూ ఉంటామని పలువురు పే ర్కొన్నారు. మా తల్లిదండ్రులు ఇక్కడే జీవిస్త్తున్నారని, తమ ఓట్లు తొల గించడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన వారు కూడా కొంత మంది గ్రామంలో ఉండటం లేదని, వారి ఓట్లను ఎందుకు తొలగించడంలేదన్నారు. సెప్టెంబరు 22న ఫాం-7 ద్వారా వచ్చి న 112 ఓట్లను పరిశీలించి 33 ఓట్లు తొలగించారని, ఇలా ఎన్నిసార్లు ఓట్లు తొలగిస్తారని పలువురు ఓటర్లు అధికారులను నిలదీశారు.
బెజ్జం కృష్ణంరాజు మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో 60 మంది బెజ్జం కు టుంబీకులం ఉన్నామని తెలిపారు. మేమంతా టీడీపీకి సానుభూతిపరు లం కావడంతో అధికార పార్టీ నాయకులు పదేపదే ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు చేస్తున్నారని తెలిపారు.
టీడీపీ ఓట్ల తొలగింపునకు దరఖాస్తు
మేదరమెట్ల, డిసెంబరు 18: మండలంలోని తిమ్మనపాలెంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని ఫిర్యాదు చేశారు. గ్రామంలోని 285 నెంబరు బూత్‌పరిఽధిలో ఓట్లు తొలగించాలని ఈనెల 6న ఫాం 7 దరఖాస్తు చేశారు. సోమవారం విచారణ సందర్భంగా ఓటీపీ అడిగితే చెప్పాం తప్ప తాము ఎవరి ఓట్లు తీసివేయాలని దరఖాస్తు చేయలేద న్నారు. తమకు సరైన అవగాహన లేకపోవడంతో ఓటీపీ చెప్పామన్నా రు. చాలా గ్రామాల్లో ఇదేవిధంగా అవగాహన లేని వ్యక్తుల పేరుతో ఫాం 7 లు దరఖాస్తులు చేస్తున్నారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు అధికార పార్టీ నేతలు అక్రమమార్గంలో దరఖాస్తులు చేపిస్తున్నారని తిమ్మనపా లెం టీడీపీ నాయకులు ఆధికారులకు పిర్యాదు చేశారు.