మహాత్మునికి ఘన నివాళి

ABN , First Publish Date - 2023-10-03T03:26:33+05:30 IST

మండలంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

మహాత్మునికి ఘన నివాళి

గిద్దలూరు , అక్టోరు 2 : మండలంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, వైస్‌ చైర్మన్లు ఆర్‌.డి.రామకిష్ణ్ర, దీపిక, కమిషనర్‌ రామక్రిష్ణయ్య, కౌన్సిలర్లు, సిబ్బంది ర్యాలీగా వెళ్ళి మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇరువురు పారిశుధ్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు. జీవనజ్యోతి డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ విద్యార్థులు పట్టణంలో కవాతు నిర్వహించి గాంధీ విగ్రహం ఎదుట నివాళులు అర్పించారు. ఎన్‌సిసి ఆఫీసర్‌ నిరంజన్‌బాబు, ప్రిన్సిపాల్‌ మాబుషరీఫ్‌, అధ్యాపకులు పాల్గొన్నారు. పోలీసుస్టేషన్‌లో ఎస్సైలు మహేష్‌, అజిత, పోలీసు సిబ్బంది గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాసవిక్లబ్‌ ఆధ్వర్యంలో ఉయ్యాల వాడ, సంజీవరాయునిపేట, బురుజుపల్లి పాఠశాలల్లోని మహాత్మ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఓబులా పురంలో ఎంపీపీ కడప లక్ష్మీ, మాజీ ఎంపీపీ కడప వంశీధర్‌రెడ్డి, సర్పంచ్‌ బొర్రా శ్రీదేవి, ఎంపిటిసి దేవదాస్‌, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ క్రిష్ణారెడ్డి తదితరులు మొక్క లు నాటి గాంధీ జయంతి వేడుకలను జరుపుకున్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

త్రిపురాంతకం త్రిపురాంతకంలోని వాసవీకన్యకా పరమేశ్వరీ అమ్మవారిశాలలో ఉన్న మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల ఆర్యవైశ్యసంఘం ప్రతినిధులు సీహెచ్‌.హనుమంతరావు, జి.చిన్నసుబ్బారావు, కె.ప్రసాద్‌, కె.పూర్ణనాగేశ్వరరావు, జి.సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

రాచర్ల :. చినగాని పల్లెలో జడ్పీటీసీ సభ్యురాలు పగడాల దేవి ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాచర్లలో సర్పంచ్‌ సగినా ల రాయలమ్మ, ఏపీవో మోషే మొక్కలు నాటారు. అనంపల్లి సచివాలయంలో సర్పంచ్‌ శిరిగిరి రమేష్‌, ఎంపిటిసి ఏలం రాజేశ్వరి పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ఆయా కార్యక్రమాలలు రాయణ, దొనపాటి శేఖర్‌, సీఆర్‌ఐ మురళి, సూరా పాండురంగారెడ్డి, బెల్లం నాగిరెడ్డి, గందం రవి, మాజీ సర్పంచ్‌ పాండురంగారెడ్డి, నాయబ్‌రసూల్‌, మద్దులేటి మురళి పాల్గొన్నారు.

సర్పంచ్‌కు నిధులు మంజూరు చేయాలి

రాచర్ల : గాంధీ జయంతి సందర్భంగా సోమవారం నుంచి అయినా సర్పంచులకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి చినగానిపల్లె సర్పంచ్‌ పగడాల రమేష్‌ కోరారు.

ఎర్రగొండపాలెం : మహాత్మగాంధి జయంతి సందర్భంగా సందర్భంగా సోమవారం ఎర్రగొండపాలెంలో టీడీపీ దీక్షా శిబిరం వద్ద గాంఽధి చిత్రపటానికి పూలమాల వేసి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు నివాళులు తెలిపారు. టీడీపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు నివాళులు తెలిపారు.

కొమరోలు : మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోను, ప్రభుత్వ కార్యాలయాల్లోను మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్ధానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలోని మహాత్మాగాంఽధి విగ్రహానికి జెడ్పీటీసీ సభ్యులు సారె వెంకటనాయుడు, ఎంపీటీసీ సభ్యులు షేక్‌ మౌలాలి, తిరుపతిరాజు, షేక్‌ సుభాని, కార్యాదర్శి సురేష్‌, ఉప సర్పంచ్‌ దర్శి రమణయ్యలు పూలయాలవేసి ఘనంగా నిర్వహించారు. వస్ధానిక తహశీల్ధార్‌ కార్యాలయంలోను, మండలంలోని కసినెపల్లి గ్రామంలో గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహంచారు.

కంభాలపాడు బిట్స్‌ కళాశాలలో గాంధీజి, లాల్‌బహుదూర్‌ శాస్ర్తీ జయంతి వేడుకలను సెక్రెటరి బెల్లంకొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని మార్కాపురం పట్టణంలో సోమవారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, అన్నా వెంకట రాంబాబులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్‌ బాలమురళీకృష్ణ, కమిషనర్‌ గిరికుమార్‌, డీఈ సుభానీ, ఏఈ ఆదినారాయణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు జెంకే వెంకటరెడ్డి తన నివాసంలో గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. హెడ్‌ పోస్టాఫీసులో సూపరిం టెండెంట్‌ శ్రీనివాసుల ఆధ్వర్యంలో మహాత్మునికి నివాళులు అర్పించారు. పోస్టల్‌ కార్యాలయంలో మొక్కలు నాటారు. నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు ఇమ్మడి కాశీనాథ్‌ ఆధ్వర్యంలో మహాత్ముని చిత్రపటానికి నివాళులు అర్పించారు. కమలా పాఠశాలలో కరస్పాండెంట్‌ పి.పవన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

తర్లుపాడు, : స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఉన్న గాంధీ విగ్రహానికి పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వాసవీ, వనితా క్లబ్‌, నెహ్రూ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పాలు, పండ్లను పంపిణీ చేశారు పర్యావరణ పర్యవేక్షణ కోసం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 1600 మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్‌.నరసింహులు, తహశీల్దార్‌ అజీద్‌ అహ్మద్‌, ఎంఈఓ-2 అచ్యుత్‌ సుబ్బారావు, జెడ్పీటీసీ సభ్యురాలు వెన్నా ఇందిరా, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కశ్శెట్టి జగన్‌బాబు, పాల్గొన్నారు.

కంభం : కంభం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సోమవారం ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

బేస్తవారపేట : బేస్తవారపేట గ్రామ సచివాలయంలో సోమవారం గాంధీజయంతిను పురష్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి స్వీట్స్‌ పంపిణి చేశారు.గాంధీ సిద్దాంతాల గురించి వివరించారు.ఈకార్యక్రమంలో సర్పంచ్‌ అశ్రీతజ్యోతి,కార్యదర్శి నరేంద్ర,బి.ప్రేమానంద్‌ ఎంపీటీసీ దూదెకుల ఖాజామీయా పాల్గొన్నారు.

Updated Date - 2023-10-03T03:26:33+05:30 IST