వణికించిన వడగళ్లు

ABN , First Publish Date - 2023-03-20T00:06:52+05:30 IST

జిల్లాలోని త్రిపురాంతకం, దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లో ఆదివారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. సుమారు అర్ధగంటపాటు ఇది కొనసాగింది. దీంతో ప్రజలు ఇళ్లలోకి పరుగులు తీశారు. త్రిపురాంతకంలో పెద్దపెద్ద వడగళ్లు పడ్డాయి. దర్శిలో రాత్రి 7 నుంచి 7.30 వరకూ వర్షం కొనసాగింది. దీంతో రోడ్లపై వడగళ్లు పెద్దఎత్తున నిండిపోయాయి. శనివారం భారీ వర్షం కురవడంతో వరి ఓదెలు, కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసిపోయిన విషయం విదితమే. ఆదివారం ఉదయం వాన లేకపోవడంతో వరి ఓదెలను రైతులు ఆరబెట్టుకున్నారు.

వణికించిన వడగళ్లు
దర్శిలో కురుస్తున్న వడగళ్ల వాన

పలుచోట్ల వర్షం

ఆందోళనలో రైతులు

దర్శి/త్రిపురాంతకం/ముండ్లమూరు/తాళ్లూరు, మార్చి 19 : జిల్లాలోని త్రిపురాంతకం, దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లో ఆదివారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. సుమారు అర్ధగంటపాటు ఇది కొనసాగింది. దీంతో ప్రజలు ఇళ్లలోకి పరుగులు తీశారు. త్రిపురాంతకంలో పెద్దపెద్ద వడగళ్లు పడ్డాయి. దర్శిలో రాత్రి 7 నుంచి 7.30 వరకూ వర్షం కొనసాగింది. దీంతో రోడ్లపై వడగళ్లు పెద్దఎత్తున నిండిపోయాయి. శనివారం భారీ వర్షం కురవడంతో వరి ఓదెలు, కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసిపోయిన విషయం విదితమే. ఆదివారం ఉదయం వాన లేకపోవడంతో వరి ఓదెలను రైతులు ఆరబెట్టుకున్నారు. మళ్లీ రాత్రి వర్షం కురవడంతో వారు లబోదిబోమంటున్నారు. ఇంకా పడితే ధాన్యం రంగుమారి మొలకెత్తుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్రిపురాంతకంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం సాయంత్రం కొద్ది సేపు వడగళ్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచే వాతావణంలో మార్పులు రావడంతో పంట ఉత్పత్తులను పొలాల్లో ఉంచిన రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మిర్చిని ఇళ్ల వద్దకు చేర్చుకోవడం, అవకాశం లేనివారు పట్టలు కప్పుకోవడం చేశారు. స్వల్ప వర్షమే కురవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ముండ్లమూరు మండలంలోని బసవాపురంలో వడగళ్ల వాన కురిసింది. ఇతర గ్రామాల్లో భారీ వర్షం పడింది. దీంతో వరి ఓదెలు, బర్లీ పొగాకు తడిసిపోయాయి. మండలకేంద్రమైన తాళ్లూరుతోపాటు తూర్పుగంగవరంలో వడగళ్ల వాన కురిసింది.

Updated Date - 2023-03-20T00:06:52+05:30 IST