వామ్మో పెద్దపులి!

ABN , First Publish Date - 2023-06-20T00:48:00+05:30 IST

మూడు నెలలుగా తీవ్రమైన ఎండలు, వడగాలులకు పెద్ద పులులు సైతం అడవిని వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి.

వామ్మో పెద్దపులి!

దాహార్తి తీర్చుకునేందుకు కంభం చెరువుకు..

హడలిపోతున్న ప్రజలు

కంభం, జూన్‌ 19 : మూడు నెలలుగా తీవ్రమైన ఎండలు, వడగాలులకు పెద్ద పులులు సైతం అడవిని వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. రాత్రివేళల్లో కంభం చెరువు వద్దకు చేరుకొని దాహార్తిని తీర్చుకొంటున్నాయి. రెండు మూడు రోజుల నుంచి చీకటిపడ్డాక అయ్యవారిపల్లె సమీపంలోని చింతమల్లెలపాడు గ్రామాల మీదుగా రెండు పెద్దపులులు కంభం చెరువు, నీటి కుంటల వద్దకు వస్తున్నట్లు గ్రామస్థులు గుర్తించారు. దాహార్తి తీర్చుకుని తిరిగి అడవిలోకి వెళ్తున్నాయి. ఈ రెండు పెద్దపులులను గమనించిన మేకల కాపరులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత నెలలో కూడా పెద్దపులి వెలగలపాయలోని నర్సిపురం, కోమటికుంట, పుట్టుగొంది, నాగులవరం మీదుగా కంభం చెరువుకు వచ్చి నీరు తాగి వెళ్లింది. మరోసారి దాహం తీర్చుకునేందుకు జనావాసాల వద్దకు పెద్దపులులు వస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-06-20T00:48:00+05:30 IST