Share News

ఆట ముసుగులో ఇదేం ప్రచారం!

ABN , First Publish Date - 2023-11-20T00:52:20+05:30 IST

ప్రపం చకప్‌ ప్రత్యక్ష ప్రసారం పేరుతో వైసీపీ సొంత ప్ర చారం చేసుకుంది. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏ సీఏ) ఆధ్వర్యంలో ఒంగోలులోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ స్ర్కీన్‌పై పదేపదే జగన్‌, బా లినేని భజనతో కూడిన దృశ్యాలతో విసుగు తెప్పిం చింది.

 ఆట ముసుగులో ఇదేం ప్రచారం!

ఏసీఏ ఖర్చుతో ఒంగోలులో ఎల్‌ఈడీ స్ర్కీన్‌

అభిమానులు ప్రపంచ కప్‌ వీక్షించేందుకు ఏర్పాట్లు

మధ్యలో జగన్‌, బాలినేని భజన

ఒంగోలు (కార్పొరేషన్‌), నవంబరు 19: ప్రపం చకప్‌ ప్రత్యక్ష ప్రసారం పేరుతో వైసీపీ సొంత ప్ర చారం చేసుకుంది. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏ సీఏ) ఆధ్వర్యంలో ఒంగోలులోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ స్ర్కీన్‌పై పదేపదే జగన్‌, బా లినేని భజనతో కూడిన దృశ్యాలతో విసుగు తెప్పిం చింది. ఒకవైపు భారత్‌ ఓటమి వైపు పయనిస్తుం డటంతో నిరాశతో ఉన్న క్రీడాభిమానులు వైసీపీ సొంత డబ్బాతో కూడిన ప్రకటనలు చూడలేక మ ధ్యలోనే వెళ్లిపోయారు. భారత్‌ వర్సెస్‌ ఆస్ర్టేలియా మధ్య ఆదివారం వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ ఫైనల్‌ నేప థ్యంలో గడిచిన రెండు రోజులుగా ఊరూవాడా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఉత్సాహం చూపారు. అం దుకు అనుగుణంగా ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఒంగోలులోని మినీ స్టేడియంలో ప్ర త్యేక ఎల్‌ఈడీ స్ర్కీన్‌ ఏర్పాటు చేశారు. వందల మంది క్రీడాభిమానులు మ్యాచ్‌ వీక్షించడానికి రావ డంతో తొలుత మైదానం కిటకిటలాడింది. అయితే మ్యాచ్‌ ఆరంభమైన కొద్దిసేపటికే అటు సీఎం జగ న్‌, ఇటు బాలినేనికి భజన చేసే ప్రకటనలు ప్రసా రం కావడం ప్రారంభమయ్యాయి. ఓవర్‌కు ఓవర్‌ కు మధ్యలో ప్రసారం చేసిన ఈ ప్రకటనలు ప్రజ లకు విసుగు పుట్టించాయి. ఏసీఏ సొమ్ముతో వైసీపీ ప్రచారం చేసుకోవడాన్ని చూసి క్రీడాభిమానులు ఇదేమి విడ్డూరం అంటూ నిట్టూర్చారు. అదేసమ యంలో అస్ట్రేలియా విజయం వైపు పయనిస్తుం డటంతో మధ్యలోనే చాలా మంది వెళ్లిపోయారు.

ఉదయం నుంచే సందడి..రాత్రికి ఉసూరు

భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా ఫైనల్స్‌ మ్యాచ్‌ వీక్షిం చేందుకు ఊరూ వాడా ఎంతో ఆశగా ఎదురు చూ శారు. భారత్‌ విజయం కోసం పలుచోట్ల ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. పలు శుభకార్యాలలో ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేసి బంధువులకు క్రీడా వినోదాన్ని అందించారు. నగరంలోని పలు హోటల్స్‌, లాడ్జీలు ఫుల్‌ అయ్యాయి. బెట్టింగ్‌లు కూ డా జోరుగా సాగాయి. అయితే మ్యాచ్‌లో ఆస్ర్టేలి యా విజయం సాధించడంతో క్రీడాభిమానులు తీ వ్ర నిరాశకు గురయ్యారు.

Updated Date - 2023-11-20T00:52:23+05:30 IST