వేడుకలోనూ వివాదాలే..!

ABN , First Publish Date - 2023-03-30T22:23:47+05:30 IST

ఓ వ్యక్తి ఆధిపత్య ధో రణి ఆ గ్రామాభివృద్ధికి శాపంగా మారింది. ప్ర తి విషయంలోనూ తనదే పైచేయి ఉండాలనే నియంత వైఖరికి ఆ గ్రామస్థులకు ఇబ్బందిగా మారింది.

వేడుకలోనూ వివాదాలే..!
సీఐ కార్యాలయం ఎదుట వేడుక చేయొద్దని వాదన చేస్తున్న వైసీపీ నేత

దేవుడి పండుగకు వర్గపోరేంటని

ఆగ్రహిస్తున్న గ్రామస్థులు వేదికగా నిలిచిన

వాలిచర్ల గ్రామ రామాలయం సీఐ చొరవతో సీతారాముల కల్యాణ వేడుకలు

కనిగిరి, మార్చి 30 : ఓ వ్యక్తి ఆధిపత్య ధో రణి ఆ గ్రామాభివృద్ధికి శాపంగా మారింది. ప్ర తి విషయంలోనూ తనదే పైచేయి ఉండాలనే నియంత వైఖరికి ఆ గ్రామస్థులకు ఇబ్బందిగా మారింది. రాజకీయాల్లోనే కాకుండా పదుగురు ఆనందంగా జరుపుకునే పండుగలు, ఉత్సవాల వేళ కూడా ఆ వ్యక్తి వైఖరితో గ్రామస్థులతో పా టు పాతతరం నాయకులకు తలనొప్పిగా మా రింది. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని చెప్పినా ఆ వ్యక్తి వైఖరిలో మార్పు రాకపోవ టం బాధాకరమని అందరూ భావిస్తున్నారు. పండుగ విషయంలోనూ పార్టీ విషయాలను జోడించటం ఎందుకుని సొంత అధికార పార్టీ వ్యక్తికి చెప్పలేక.. ప్రతిపక్షపార్టీ వారిపై విభే దాలకు వెళ్లలేక తల బొప్పి కట్టిపోతుందని పాతతరం నాయకులు తలలు పట్టుకుంటు న్నారు. ఇలాంటి అధిపత్య ధోరణికి ప్రధాన కారుకుడైన వ్యక్తి ప్రతి వైఖరితో విషయంలో నూ ఇబ్బందులు పడుతూ వర్గ విభేదాలకు ఆలవాలంగా మారుతున్న గ్రామం నియోజక వర్గంలోని హనుమంతునిపాడు మండలంలోని వాలిచర్ల గ్రామం. గతంలోనూ ఆ గ్రామం లోని హైస్కూల్‌ ఎస్‌ఎంసీ కమిటీ ఎంపిక లోనూ తలదూర్చి గ్రామం పరువు పోయి జిల్లా వ్యాప్తంగా అబాసుపాలైందని గ్రామ స్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంలో ముఖ్యంగా వాలిచర్ల గ్రామానికి చెందిన వైసీపీ నేత (గతంలో ఓ కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన) కావడం విశేషం. అయితే సదరు వ్యక్తి వైఖరితో ఎమ్మెల్యేకి కూడా చెడ్డపేరు ఆపాదిస్తున్నట్లు గ్రామస్థులు అంటున్నారు.

మళ్లీ గురువారం వాలిచర్ల గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా జరగాల్సిన రామాలయం ఉత్సవ, కల్యాణ వేడుకలకు ఆటంకం ఏర్పడింది. ఈ వేడుకలో పాల్గొనడానికి వీలు లేదంటూ రెడ్డి సామాజికవర్గంలోని ఇంకో వర్గం వారు ఈ కార్యక్రమాలను చేయడానికి అనర్హులంటూ అడ్డుకున్నారు. మరో వర్గానికి చెందిన ప్రతిపక్ష పార్టీ నేతలు స్వామికార్యం కదా దానిపై వివా దాలెందుకని భావించకపోవడం బాధాకరం. ఈ ఆధిపత్య వైఖరితో గ్రామ స్థులకు పండుగ వాతావరణ లేకుండా చేశారు. ఈ పంచాయితీ కాస్తా పోలీసు స్టేషన్‌కు చేరింది. చివరికి సీఐ పాపారావు ఇరు వర్గాలకు సర్దిచెప్పి గురు వారరం సాయం త్రానికి ఉత్సవ కార్యక్ర మాలను అనుకూలంగా జరిపించారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకుని పండుగ జరుపుకున్నారు.

Updated Date - 2023-03-30T22:23:47+05:30 IST