దొంగతనాలే వృత్తిగా..
ABN , First Publish Date - 2023-06-02T23:03:08+05:30 IST
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మహిళల మెడల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడటమే వృత్తిగా ఎంచుకున్న ముగ్గురు దొంగలను శుక్రవారం అరెస్టు చేసినట్లు కనిగిరి డీఎ్‌సపీ రామరాజు తెలిపారు. స్థానిక డీఎ్‌సపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హనుమంతునిపాడు మండలం విరగారెడ్డిపల్లి గ్రామంలో రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధురాలు ఉడుముల ఆదిలక్షమ్మ మెడలో నుంచి బంగారు చైను గుంజుకుని దొంగలు పారిపోయారు. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగతనానికి పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డీఎ్‌సపీ తెలిపారు.

బంగారు చైను, మోటర్ బైక్ స్వాధీనం
డీఎస్పీ రామరాజు
కనిగిరి, జూన్ 2: జిల్లాలోని పలు ప్రాంతాల్లో మహిళల మెడల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడటమే వృత్తిగా ఎంచుకున్న ముగ్గురు దొంగలను శుక్రవారం అరెస్టు చేసినట్లు కనిగిరి డీఎ్‌సపీ రామరాజు తెలిపారు. స్థానిక డీఎ్‌సపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హనుమంతునిపాడు మండలం విరగారెడ్డిపల్లి గ్రామంలో రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధురాలు ఉడుముల ఆదిలక్షమ్మ మెడలో నుంచి బంగారు చైను గుంజుకుని దొంగలు పారిపోయారు. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగతనానికి పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డీఎ్‌సపీ తెలిపారు. పొదిలి పట్టణానికి చెందిన పోలా అంజయ్య, పోలా నరేష్, పోలా యేసుదాసులు జిల్లాలోని పలు ప్రాంతాలలో బైకుపై స్పీడుగా వచ్చి మహిళల మెడల్లో ఉన్న గొలుసులను గుంజుకుని పరారైన సంఘటనల్లో పలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనాయని చెప్పారు. అదేవిధంగా హనుమంతునిపాడు మండలం విదగారెడ్డిపల్లి గ్రామంలో గత నెల 25న అర్ధరాత్రి బయట నిద్రపోతున్న వృద్ద్ధురాలి మెడలో ఉన్న బంగారు చైనును గుంజుకెళ్లారు. ముద్దాయిలపై నిఘా ఉంచగా సీఐ శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి, పీసీపల్లి, హనుమంతునిపాడు ఎస్‌లు మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తుండగా వేములపాడు గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిని అరెస్టు చేసి వారి నుంచి 18గ్రాములు బంగారం చైను, మోటర్‌బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుచనున్నట్లు డీఎ్‌సపీ తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన వారిని అనతికాలంలోనే పట్టుకున్న సీఐ, ఎస్‌ఐలను డీఎ్‌సపీ అభినందించారు.