చేపల చెరువుపై వైసీపీ నేత కన్ను

ABN , First Publish Date - 2023-05-22T00:13:18+05:30 IST

మండలంలోని కొణిదెన సర్కారు చెరువులో ఉ న్న చేపలను పట్టి సొమ్ము చేసుకొనేందుకు గ్రామానికి చెందిన వైసీపీ నేత రంగం సిద్ధం చేస్తున్నాడు.

చేపల చెరువుపై వైసీపీ నేత కన్ను
నీరు వదిలివేయగా ఖాళీ అయిన కొణిదెన చెరువు

అనధికారికంగా నీటిని వదిలిన వైనం

పట్టనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు

వేసవిలో చెరువు ఖాళీ కావటంతో

రైతుల్లో ఆందోళన

బల్లికురవ, మే 21: మండలంలోని కొణిదెన సర్కారు చెరువులో ఉ న్న చేపలను పట్టి సొమ్ము చేసుకొనేందుకు గ్రామానికి చెందిన వైసీపీ నేత రంగం సిద్ధం చేస్తున్నాడు. గత నాలుగు రోజుల నుంచి చెరువలో ఉన్న నీటిని బయటకు పంపుతున్నారు. పంచాయతీ కింద ఉన్న స ర్కారు చెరువుకు పాట పెట్టి అందుకు వచ్చే అదాయాన్ని గ్రామ అభి వృద్ధి పనులకు కేటాయించాల్సి ఉంది. గత ఏడాది చెరువు పాట పె ట్టకుండానే వదిలివేశారు. చెరువులో అప్పటికే ఉన్న చేపలపై కన్నేసి న ఒక నేత తనకు అడ్డు ఎవరు వస్తారులే అని అధికారులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే చెరువులో ఉన్న చేపలను పొరుగు మండలానికి చెందిన ఒక కాంట్రాక్టర్‌కు అమ్మకాలు చేసినట్లు తెలుస్తుంది.

గ్రామ పంచాయతీకి సంబంధించిన చెరువలో చేపలు వేసి పెంచా లంటే మత్స్యశాఖ శాఖ అనుమతులు ఉండాల్సి ఉంది. ఎవరి అను మతులు లేకుండానే చెరువులో ఉన్న చేపలు పట్టేందుకు నీటిని బయ టకు పంపటం పట్ల రైతుల్లో ఆందోళన మొదలైంది. వేసవిలో నీటికి తీవ్ర ఇబ్బందులు ఉన్నా చెరువలో నీటిని ఎలా వదిలి పెడుతున్నారని అధికారులకు తెలిపినా పట్టించుకోవటం లేదని రైతులు ఆరోపిస్తున్నా రు. చెరువులో నీరు ఉంటే పశువులకు ఎంతో ఉపయోగమని, చేపల కోసం నీటిని వదిలి వేశారని వారు ఆరోపిస్తున్నారు. ఒకరి ఆదాయం కోసం గ్రామ పంచాయతీకి రావాల్సిన ఆదాయం పోతుంది. సకాలంలో పాట పెట్టి అందుకు వచ్చే లీజు చెల్లించి ఉంటే బాగుండేది. అధికారు లు కూడా చెరువు పాటపై మీనమేషాలు లెక్కిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో చేపల కోసం నీటిని వదిలినట్లు తెలిసిన గ్రామ ప్రజలు తాము కూడా సొంతంగా వెళ్లి చేపలు ప ట్టుకొంటామని ఎవరు అడ్డుకొంటారో చూస్తామంటూ బహిరంగంగా అంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొణిదెన చెరువులో ఉన్న అరకొర నీటిని ఉంచేలా చర్యలు చేట్టి చెరువులో ఉన్న చేపల ను అమ్మకాలు చేపట్టి పంచాయతీ ఖాతాలో జమ చేసేలా చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

నీటి విడుదల తన దృష్టికి రాలేదు

- సీతామహాలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి

చెరువులో నీటిని విడుదల చేసిన విషయం తన దృష్టికి రాలేదు. పంచాయతీ చెరువుకు గత ఏడాది పాట పెట్టలేదు. పరిశీలించి చర్యలు తీసుకోంటాం. తాను సెలవులో ఉన్నాను.

Updated Date - 2023-05-22T00:13:18+05:30 IST