వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

ABN , First Publish Date - 2023-02-16T22:12:31+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని టీడీపీ మం డల అధ్యక్షుడు మేకల వలరాజు అన్నారు. మండలంలోని ఎండూరివారిపాలెం గ్రామంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆదేశాలతో గురువారం నిర్వహించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం
ఎండూరివారిపాలెంలో ఇదేం ఖర్మ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు

త్రిపురాంతకం, ఫిబ్రవరి 16 : వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని టీడీపీ మం డల అధ్యక్షుడు మేకల వలరాజు అన్నారు. మండలంలోని ఎండూరివారిపాలెం గ్రామంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆదేశాలతో గురువారం నిర్వహించారు. ఈ సంద ర్భం గా వలరాజు మాట్లాడుతూ జగన్‌రెడ్డి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. అభివృద్ధిని విస్మరించి విధ్వంసాలు, అక్రమాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సొంత ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారని, ఎవరికీ రక్షణ లేకుం డా పోయిందన్నారు. లోకేష్‌ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర స్పందన చూసి వైసీ పీ నాయకులకు నిద్రపట్టడంలేదన్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా, అభివృద్ధి సాధించాల న్నా టీడీపీ ప్రభుత్వం రావాలని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. కార్యక్రమం లో మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మోటకట్ల శ్రీనివాసరెడ్డి, నాయకులు ఆళ్ల నాసరరెడ్డి, దేవినేని చలమయ్య, వి.ఆంజనేయులు, ఎం. అల్లూరిరెడ్డి, జి.వెంకటనారాయణ, చప్పిడి కోటయ్య, దూదిపల్లి యోగయ్య, గుత్తా వెంకటేశ్వర్లు, యూనిట్‌ ఇన్‌చార్జ్‌లు, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-16T22:12:34+05:30 IST