Share News

మంత్రి ఇంటి ముట్టడి ఉద్రిక్తం

ABN , Publish Date - Dec 31 , 2023 | 01:13 AM

సమస్యల పరిష్కా రంలో ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ అంగన్‌వాడీలు శని వారం ఏకకాలంలో ఒంగోలులోని మంత్రి ఆదిమూలపు సురేష్‌ క్యాంపు కార్యాల యాన్ని, మార్కాపురంలోని ఆయన నివా సాన్ని ముట్టడించారు.

మంత్రి ఇంటి ముట్టడి ఉద్రిక్తం
మార్కాపురంలో మంత్రి సురేష్‌ ఇంటిని ముట్టడించిన అంగన్‌వాడీలు (ఇన్‌సెట్‌లో) పోలీసులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వామపక్షాల నేతల మధ్య తోపులాట

మార్కాపురంలో సురేష్‌ నివాసం వద్ద ఆందోళన

ఇంటిలోకి ప్రవేశించేందుకు యత్నం

పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట

సొమ్మసిల్లిపడిపోయిన ఆయా

ఆందోళనను కొనసాగిస్తున్న అంగన్‌వాడీలు

జిల్లా అంతటా ధర్నాలు

ఒంగోలు నగరం/మార్కాపురం వన్‌ టౌన్‌, డిసెంబరు 30: సమస్యల పరిష్కా రంలో ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ అంగన్‌వాడీలు శని వారం ఏకకాలంలో ఒంగోలులోని మంత్రి ఆదిమూలపు సురేష్‌ క్యాంపు కార్యాల యాన్ని, మార్కాపురంలోని ఆయన నివా సాన్ని ముట్టడించారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఒంగోలులోని కలెక్టర్‌రేట్‌ నుంచి సంతపేటలోని మంత్రి క్యాంపు కార్యాల యం వరకు కార్యకర్తలు, ఆయాలు ప్రద ర్శన నిర్వహించారు. అక్కడ యూనియన్‌ నాయకురాలు ప్రశాంతి అధ్యక్షతన ధర్నాకు దిగారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అంగన్‌వాడీల ఆందోళనను పట్టించుకోవడం లేదన్నారు. అంగన్‌వాడీలకు గౌరవ వేతనం కాదని, కనీస వేతనం అడుగుతు న్నారన్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న మహిళలకు కనీస వేతనాల్ని అమలుచేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సాక్షి మీడియాలో అబద్ధాలను వండి వారుస్తున్న దని ఆయన ఆరోపించారు. అంగన్‌వాడీల ఉద్యమాన్ని చీల్చేవిధంగా తప్పుడు రాతలు రాస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ మంత్రులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని, లేని పక్షంలో వారిని బహిరంగ చర్చకు పిలుస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించకపోతే ఆందోళనను ప్రజా ఉద్యమంగా మార్చి తీవ్రతరం చేస్తామ న్నారు. ఉద్యమం తీవ్రమైతే జరిగే పరిణామాలకు జగన్‌మోహన్‌రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అంగన్‌వాడీ వర్కర్సు అండ్‌ హెల్పర్సు యూనియన్‌ నాయకులు కె.వి.సుబ్బమ్మ, కల్పన మాట్లాడుతూ అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అంగన్‌వాడీలను అసభ్య పదజా లంతో దూషిస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో వారు ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.

మార్కాపురంలో తోపులాట

మార్కాపురంలో మంత్రి నివాసాన్ని వందలసంఖ్యలో కార్యకర్తలు, ఆయాలు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య తోపులాట జరిగింది. సీఎం డౌన్‌డౌన్‌.. పోలీసుల దౌర్జన్యం నశించాలని కార్యకర్తలు, ఆయాలు నినాదాలు చేశారు. మంత్రి బయటకు రావాలి అంటూ పెద్దఎత్తున కేకలు వేశారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని అంగన్‌వాడీలు మంత్రి నివాసం గేట్లు ఎక్కి లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈసమయంలో మంత్రి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గేట్లు తోసుకుని మంత్రి నివాసం ఆవరణలోకి ప్రవేశించి ఆందోళన నిర్వహించారు. అంగన్‌వాడీలను అడ్డుకోవడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ఆందోళనను ఉద్దేశించి యూనియన్‌ జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యాఖ్యానాలపై విరుచుకుపడ్డారు. ఒక ఎమ్మెల్యే అంగన్‌వాడీలకు బలిసిందంటున్నారు.. రూ.లక్షల జీతం తీసుకుంటున్నా ఆయనకు బలిసిందా లేక నెలకు రూ.11 వేలు వేతనం తీసుకుంటున్న చిరుద్యోగులకు బలుస్తుందా? అనిప్రశ్నించారు. ఇంకో ఎమ్మెల్యే మనల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ చెబుతున్నారని ఎమ్మెల్యేలు అప్పలనాయుడు, ధర్మశ్రీలపై మండిపడ్డారు. జిల్లావ్యాప్తంగా అన్ని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కేంద్రాల్లో అంగన్‌వాడీలు ధర్నాలు నిర్వహించారు. ఒంగోలు, మార్కాపురం, తదితర ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలో సీఐటీయూ జిల్లా కార్యదర్శులు గంటుపల్లి శ్రీనివాసులు, బంకా సుబ్బారావు, పి.ఆంజనేయులు, రాము, తంగిరాల మహేష్‌, హేమలత, మోజెస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 01:13 AM