Share News

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 14 , 2023 | 11:52 PM

అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఎం, జనసేన, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం మూడోరోజు అంగన్‌వాడీల నిరసన కార్యక్రమం నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కొనసాగింది. మండల కార్యాలయాల ఎదుట అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు నిరసన తెలిపారు. కొండపిలో సీఐటీయూ కొండపి డివిజన్‌ అధ్యక్షుడు జి. వందనం మాట్లాడుతూ అంగన్‌వాడీలకు 26వేల రూపాయల జీతం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
కొండపిలో మోకాళ్లపై నిలిచి నిరసన తెలియజేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు

కొండపి, డిసెంబరు 14 : అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఎం, జనసేన, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం మూడోరోజు అంగన్‌వాడీల నిరసన కార్యక్రమం నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కొనసాగింది. మండల కార్యాలయాల ఎదుట అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు నిరసన తెలిపారు. కొండపిలో సీఐటీయూ కొండపి డివిజన్‌ అధ్యక్షుడు జి. వందనం మాట్లాడుతూ అంగన్‌వాడీలకు 26వేల రూపాయల జీతం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వారి పనికి తగిన వేతనం ప్రభుత్వం ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటోందని విమర్శించారు. అనంతరం అంగన్‌వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేస్తూ నినదించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వై. రూబెన్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

జనసేన మద్దతు... పొన్నలూరులో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మూడోరోజు జరిగిన నిరసన కార్యక్రమంలో అంగన్‌వాడీలకు మద్దతుగా జనసేన నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. జనసేనన నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్‌కుమార్‌, జనసేన సింగరాయకొండ, జరుగుమల్లి మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్‌, గూడ శశిభూషణ్‌, పొన్నలూరు మండల నాయకుడు శశిభూషణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 11:52 PM