Share News

అంగన్‌వాడీలపై కక్ష సాధింపు తగదు

ABN , Publish Date - Dec 29 , 2023 | 10:58 PM

అంగన్‌వాడీలపై ప్రభుత్వానికి కక్ష సాధింపు తగదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు కొనసాగిస్తున్న రిలే దీక్షలకు మద్దతుగా డాక్టర్‌ ఉగ్ర సంఘీభావం తెలిపారు.

అంగన్‌వాడీలపై కక్ష సాధింపు తగదు
కనిగిరిలో మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర

సమ్మెకు సంఘీభావం తెలిపిన డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, డిసెంబరు 29 : అంగన్‌వాడీలపై ప్రభుత్వానికి కక్ష సాధింపు తగదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు కొనసాగిస్తున్న రిలే దీక్షలకు మద్దతుగా డాక్టర్‌ ఉగ్ర సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, నేతలు రాచమల్ల శ్రీనివాసులురెడ్డి, ఫిరోజ్‌, అహ్మద్‌, తమ్మినేని వెంకటరెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాఽధ్యక్షుడు పీసీ కేశవరావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రాజేశ్వరి, రజని, రామసుబ్బులు, భాగ్యలక్ష్మీ, సీత, సౌందర్య, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన ర్యాలీ

దర్శి, డిసెంబరు 29 : డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఆందోళనల్లో బాగంగా 18వ రోజు శుక్రవారం అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన ర్యాలీ, ధర్నా చేశారు. తొలుత ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం పోస్టాపీస్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అన్ని కేంద్రాల నుంచి సీఎం వైఎస్‌ జగన్‌కు సమస్యలు పరిష్కరించాలని ఉత్తరాలు రాసి పోస్టు చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షురాలు ఏ తిరుపతమ్మ మాట్లాడుతూ వైసీపీ పాలకులు అంగన్‌వాడీ కార్యకర్తల పట్ల కక్షపూరిత వైఖరి అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు నాలుగు వేల రూపాయల వేతనాలు పెంచామని అబద్ధాలు ప్రచారం చేయటం శోచనీయమన్నారు. సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాఽశం వెంకటేశ్వర్లు, రైతు సంఘం ఉపాధ్యక్షులు పంటా ఏడుకొండలు దీక్ష శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. యూనియన్‌ నాయకురాళ్లు అంజమ్మ, సుబ్బమ్మ, అనిత, నాగజ్యోతి, విశ్వవాణి, ఎలీషమ్మ, మల్లేశ్వరి, పద్మావతి, సీఐటీయూ నాయకులు సందు వెంకటేశ్వరరావు, టి. రంగారావు, యు. మోహన్‌రావు, నారాయణ, నాగేశ్వరరావు, షేక్‌ బాష పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 10:58 PM