ఇంటింటికీ టీడీపీ మహాశక్తి
ABN , First Publish Date - 2023-08-02T22:44:55+05:30 IST
టీడీపీ మహాశక్తి ఆధ్వర్యంలో ఆ పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య ఆదేశాల మేరకు మహాశక్తి శ్రేణులు ఆ పార్టీ మిని మ్యానిఫెస్టోలోని పథ కాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటి కీ తిరుగుతూ పంపిణీ చేస్తున్నారు. బుధవారం పేరాల శివాలయం గుడి నుంచి ఇంటింటికీ తి రుగుతూ కరపత్రాలను పంచుతూ వైసీపీ అ రాచకాలను వివరించారు.
ముమ్మరంగా ప్రచారం
చీరాల, ఆగస్టు 2 : టీడీపీ మహాశక్తి ఆధ్వర్యంలో ఆ పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య ఆదేశాల మేరకు మహాశక్తి శ్రేణులు ఆ పార్టీ మిని మ్యానిఫెస్టోలోని పథ కాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటి కీ తిరుగుతూ పంపిణీ చేస్తున్నారు. బుధవారం పేరాల శివాలయం గుడి నుంచి ఇంటింటికీ తి రుగుతూ కరపత్రాలను పంచుతూ వైసీపీ అ రాచకాలను వివరించారు. టీడీపీ అధికారంలో కి రావల్సిన చారిత్రక అవసరం ఉందని చె ప్పారు. అనంతరం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అన్ని సమస్యలకు పరిష్కారమని చె ప్పారు. కార్యక్రమంలో టీడీపీ మహాశక్తి శ్రేణు లు, నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ విఘ్నేశ్వరకాలనీ, శారదా కాలనీలలో బుధవారం టీడీపీ మహాశక్తి శ్రేణులు ఇం టింటికీ తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చే శారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ఎంత సంపాదించినా మధ్యతరగతి, దిగువ మ ధ్యతరగతి ప్రజలకు మూడు పూటలా తిండికి కూడా సరిపోని దౌర్భాగ్యపు పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. కార్యక్రమంలో మహిళాశక్తి శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.