ప్రధాన రోడ్లు ఛిద్రం..!

ABN , First Publish Date - 2023-08-02T22:43:24+05:30 IST

చీరాల మండల పరిధిలోని పలుచోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు కోరలు చాపి ప్రమాదంగా ఉన్నాయి. ఛిద్రమైన ఈ రోడ్లు, మరోవైపు వర్షాలతో ప్ర జలు, వాహనదారులు నరకం చూస్తున్నారు.

ప్రధాన రోడ్లు ఛిద్రం..!
స్ట్రయిట్‌కట్‌ ప్రధాన రహదారి గోతుల్లో నిలిచిన నీరు

ప్రధాన రోడ్లు ఛిద్రం..!

చీరాలటౌన్‌, ఆగస్టు 2 : చీరాల మండల పరిధిలోని పలుచోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు కోరలు చాపి ప్రమాదంగా ఉన్నాయి. ఛిద్రమైన ఈ రోడ్లు, మరోవైపు వర్షాలతో ప్ర జలు, వాహనదారులు నరకం చూస్తున్నారు. ఈ క్ర మం లో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరిగి భారీ మూ ల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అయితే ఇటువంటి సంఘటనలు నిత్యం చీరాల నుంచి బాపట్ల, గుంటూరు, విజయవాడ సైతం ప్రయాణించే వాహనాలకు తప్పడం లేదు. వివరాల్లోకి వెళితే.. నిత్యం వందల సంఖ్యలో ద్విచ క్రవాహనాలు, బస్సులు, వివిధ రకాల హెవీ, లైట్‌ వాహనాలు ఈపూరుపాలెం మీదుగా ప్రయాణాలు సాగిస్తున్నాయి. ఈపూరుపాలెం పంచాయతీ అయి నప్పటికీ మేజర్‌ పంచాయతీ కావడం ఒకవైపు, మరోవైపు నిత్యం ప్రయాణాలు జరిపే వాహనాలు, ప్రజల కారణంగా ఆ గ్రామం కాస్త రద్దీ వాతావర ణం నెలకొన్నది. కానీ ఈపూరుపాలెం స్ట్రయిట్‌ కట్‌ కాలువ వద్ద నుంచి బా య్స్‌ హై స్కూల్‌ వరకు సుమారు కిలో మీటరు మేరకు పలుచోట్ల రోడ్డు శిథిలావస్థకు చే రి అధ్వానంగా ఉంది. పలుచోట్ల పెద్ద పెద్ద గుం తలు. పైగా చాలాభాగం పల్లు ప్రాంతం. దీంతో కొద్దిపాటి వర్షం కురిసిన రోడ్లు ఏమాత్రం కంటిచూపుకు కానరావు. అలాంటప్పు డు గుంతలు అసలే కనబడవు. ఈక్రమంలో జలమయమైన రో డ్లు, మరోవైపు గుంతలు ఉండటంతో నిత్యం ప్రయాణించే వాహన చోదకులు, మహిళలు ఎక్కడో ఒకచోట కిందపడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్న కూడా పాలకులు గానీ, అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అయితే ఇటీవల ఈ వి షయం ఏదో ఒక విధంగా పాలకులకు చేరడంతో వారు స్థానిక నాయకులకు గుంతలు పూడ్చాలని ఆదేశించారు. దీంతో గ్రామ నాయకులు అక్కడక్కడ అరకొర మట్టిపోసి చేతు లు దులుపుకున్నారు. కానీ గతకొద్ది రోజులుగా కురిసిన వర్షాలు కారణంగా ఆ మట్టి ఎటుకొట్టుకు పోయిందో కూడా ఎవ్వరికీ తెలియదు. దీంతో బాయ్స్‌ హైస్కూల్‌ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. పైగా వాహనాలు తిరిగే సమయంలో వర్షపు నీరు ప్రధాన రహదారుల్లో ఉన్న ఇళ్లపై, దుకాణాలపై పడుతుండడంతో వారు చేసేదేమీ లేక ఇళ్ల ముందు ఎరుపు జెండాలు ఉంచుతున్నారు. ఇలాంటి సంఘటనలు మండలంలో పలుచోట్ల నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రజలు శాశ్వత పరిష్కారం చూపాలని పాలకులను, అధికారులను వేడుకుంటున్నారు.

నరకం చూస్తున్నాం

గ్రామంలో సుమారు కిలో మీటర్‌ మేర ప్రధాన రహదారి మరమ్మతుల కు చేరింది. ఈక్రమంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు వర్షపు నీరు ఇళ్లల్ల్లోకి చేరుతుండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. పాలకులు, అఽధికారులు గ్రామ ప్రజల సమస్యపై దృష్టిసారించాలి.

- రాముడు, గ్రామస్థుడు

Updated Date - 2023-08-02T22:43:24+05:30 IST