భవిష్యత్‌కు గ్యారెంటీని వేగవంతం చేయాలి
ABN , Publish Date - Dec 26 , 2023 | 10:57 PM
బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు బ్రహ్మంచౌదరి, మాజీ ఎమ్మెల్యే పాపారావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఘన వి జయం సాధించడం ఖాయమని స్పష్టం చేశా రు.
దర్శి, డిసెంబరు 26 : బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు బ్రహ్మంచౌదరి, మాజీ ఎమ్మెల్యే పాపారావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఘన వి జయం సాధించడం ఖాయమని స్పష్టం చేశా రు. ఇరు పార్టీల అధినేతలు టికెట్ విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, దీంతో ఇ రు పార్టీల కార్యకర్తలు అయోమయానికి గురికావద్దన్నారు. కార్యక్రమంలో దర్శి, కురిచేడు, తాళ్లూరు మండలాల టీడీపీ అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు, నెమలయ్య, బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, టీడీపీ నాయకులు గొర్రె సుబ్బారెడ్డి కె నాగరాజు, నాగార్జునరెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జిలు రాఘవరెడ్డి, నారపుశెట్టి మధు, అంకయ్య, వెంకటరావు, రామారావు, జనసేన పార్టీ నాయకు డు ఉల్లి బ్రహ్మయ్య, కుప్పాల రుద్రా, పాపారా వు, ప్రసాద్, తోటా రామారావు, శేషయ్య, బాష, ఉప్పు అంజి పాల్గొన్నారు.