Share News

కరువు తాండవం చేస్తున్నా కనికరించని ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-11-21T21:58:07+05:30 IST

రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తు న్నా, రైతుల పట్ల ప్రభుత్వానికి కనికరం లేదని టీడీపీ బాపట్ల పార్లమెం ట్‌ అఽధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. మంగళ వారం తెలుగురైతు బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడిగా సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన నెప్పల సుబ్బారావు నియమితులయ్యారు.

కరువు తాండవం చేస్తున్నా కనికరించని ప్రభుత్వం

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ధ్వజం

పర్చూరు, నవంబరు 21: రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తు న్నా, రైతుల పట్ల ప్రభుత్వానికి కనికరం లేదని టీడీపీ బాపట్ల పార్లమెం ట్‌ అఽధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. మంగళ వారం తెలుగురైతు బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడిగా సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన నెప్పల సుబ్బారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ తెలుగు రైతు సంఘం అన్నదాతల ను చైతన్యం చేసి రైతాంగ సమస్యలపై పోరాటం చేయాలన్నారు. అనా వృష్టి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం చోద్యం చూ స్తుందని ధ్వజమెత్తారు. పుష్కలంగా నీటి వనరులు ఉన్నా, వాటిని విని యోగించుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. చేతికి వచ్చిన పంటలు నిలువునా ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సరయిన ప్రణాళిక, అవగాహన లేక నీరంతా సముద్రం పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో సాగునీటి షెడ్యూలును విడుదల చేసిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే ఏలూరి ధ్వజమెత్తారు. రైతులకు అరుతడుల పంటలపై అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం అది తమ పనికాదన్నట్లు వ్యవ హరించటం వల్లే నేడు రైతులకు ఇలాంటి పరిస్థితి నెలకొందన్నారు. దేశా నికి అన్నంపెట్టే అన్నదాతల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుం దని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వర్షాభావ పరిస్థితు లు తక్కువగా ఉన్న అన్ని జిల్లాలను కరువుగా ప్రకటించి తక్షణ సాయం అందించాలని డిమాండ్‌ చేశారు.

తెలుగు రైతు, బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడిగా సుబ్బారావు

తెలుగు రైతు, బాపట్ల పార్లమెంట్‌ అఽధ్యక్షుడిగా సం తనూతలపాడు నియోజకవర్గానికి చెందిన నెప్పలి సు బ్బారావును నియమించినట్లు టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎ మ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఈమేరకు ఆయనకు నియా మక ఉత్తర్వులు అందజేశారు. సంతనూతలపాడు మండలం గుమ్మళం పాడు గ్రామానికి చెందిన సుబ్బారావు పార్టీ ఆవిర్భావం నుంచి కొనసా గుతున్నారన్నారు. గతంలో పీఏసీఎస్‌ ప్రెసిడెంట్‌గా, పంచాయతీ సర్పం చ్‌గా, ఏపీటీజీఎస్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

Updated Date - 2023-11-21T21:58:09+05:30 IST