చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్
ABN , First Publish Date - 2023-11-20T23:36:41+05:30 IST
చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్ ఉం టుందని టీడీపీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాం బశివరావు అన్నారు.

సీఎంగా చూడటమే మన లక్ష్యం
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
మార్టూరు, నవంబరు 20: చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్ ఉం టుందని టీడీపీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాం బశివరావు అన్నారు. సోమవారం మండలంలోని ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు, మా ర్టూరు గ్రామానికి చెందిన తుమ్మల వెంకట్రావు మండల ఎస్సీ సెల్ నా యకులతో కలిసి ఏలూరిని కలిశారు. ఈ సందర్భంగా వెంకట్రావును ఆయన అభినందించారు.
ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ రెగ్యులర్ బెయిల్ మంజూర యిన చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి రానున్నారని అన్నారు. టీడీపీ నాయ కులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. చంద్రబా బుకు బెయిల్ మంజూరు కావడంతో పార్టీ కార్యకర్తలకు ఉత్తేజాన్ని కలిగించిందన్నారు. నీతి, నిజాయతీ గలిగిన చంద్రబాబు సారథ్యంలో మనందరం కష్టపడి పని చేయాలని చెప్పారు. ఆయనపై అక్రమంగా కేసులు బనాయించిన వైసీపీ ప్రభుత్వం 50 రోజులలో ఒక్క ఆధారాన్ని కోర్టులో ప్రవేశ పెట్టలేకపోయిందన్నారు. కోర్టులో న్యాయం చంద్రబాబు వైపు ఉండటంతోనే బెయిల్ వచ్చిందన్నిరు. రాష్ట్ర భవిష్యత్తు పునర్ని ర్మాణం జరగాలంటే చంద్రబాబును మరలా మనం ముఖ్యమంత్రిగా చూడాలన్నారు. అందుకోసం ప్రతికార్యకర్త పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా పని చేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులపై, కార్యకర్తలపై పెట్టే అక్రమ కేసులకు భయపడవద్దని చెప్పారు. న్యాయం మన పార్టీ పక్షాన ఉందన్నారు. రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడేతత్వంతో ముందుకు సాగాలన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక ప నులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండలంలోని పలువురు ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.