జగన్‌రెడ్డి పతనం ప్రారంభం
ABN , First Publish Date - 2023-09-26T00:49:12+05:30 IST
రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న జగన్‌రెడ్డి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

గిద్దలూరు, సెప్టెంబరు 25 : రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న జగన్‌రెడ్డి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ 13వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమస్యల పై, కుంభకోణాలపై, అన్యాయాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్న వైసీపీ ప్రజాసమస్యలను, రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలివేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర సంపదను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబుపై చేస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యలను వైసీపీ నేతలే చీదరించుకుంటున్నారన్నారు. అక్రమ అరెస్టును ఖండిస్తూ వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యులు, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, ఆపార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు బుడత మఽధుసూదన్, టీడీపీ మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, అర్ధవీడు మండలశాఖ అధ్యక్షులు మండ్లమూడి ఆంజనేయులుయాదవ్, రాచర్ల మండలశాఖ అధ్యక్షుడు కటికె యోగానంద్, టీడీపీ నాయకులు షేక్ పెద్దమస్తాన్, కేతం శ్రీను, షేక్ మహబూబ్‌భాషా, జీవనేశ్వర్‌రెడ్డి, కె.మహనంది, షేక్ అహమ్మద్‌భాషా, వీణాధరిశర్మ, ఎంపీటీసీ సభ్యుడు భూపాల్‌రెడ్డి, తెలుగుయువత అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం : మాజీముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని అక్రమ అరెస్టు చేయించి వైసీపీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్ అన్నారు. స్థానిక తర్లుపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో సోమవారం టీడీపీ నాయకులు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. ‘సైకో పోవాలి-సైకిల్ రావాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనాయకునిగా అవినీతి మరక లేకుండా ప్రజలకు సేవచేశాడన్నారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా సంఘీభావం తెలుపుతున్నారన్నారు. గతంలో ఏ నాయకుడికి ఇంత మద్దతురాలేదన్నారు. ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించే తరుణం ఆసన్నమైందన్నారు. చంద్రబాబునాయుడు ఆరోగ్యంగా, త్వరగా జైలు నుంచి బయటకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోల్‌మెనేజ్‌మెంట్ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ మౌలాలి, కొప్పుల శ్రీనివాసులు, కౌన్సిలర్ నాలి కొండయ్య, ఏఎంసీ మాజీచైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, పార్టీ నాయకులు, పఠాన్ గులాబ్, సయ్యద్ హుస్సేన్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలి
కంభం (అర్థవీడు) : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయడిని అరెస్టు చేసి ఇబ్బందులు పెడుతున్న వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని అర్ధవీడు మండలం బొల్లుపల్లె గ్రామ టీడీపీ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు తెలిపారు. గ్రామంలో సోమవారం సాయంత్రం ఇంటింటికి తిరిగి జగన్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై, దౌర్జన్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శ్రీను, ఆంజనేయులుయాదవ్, కిట్టయ్య, క్లస్టర్ ఇన్‌చార్జి రంగారెడ్డి, అచ్చయ్య, శివశంకర్ పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం : రాష్ట్రంలో టీడీపీ సభలకు భారీగా ప్రజలు తరలివస్తుండడంతో చూసి ఓర్వలేక చంద్రబాబునాయుడి పై ముఖ్యమంత్రి జగన్మోహాన్‌రెడ్డి అక్రమ కేసులు పెట్టించారని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో టీడీపీలోని రెడ్డి సామాజిక వర్గం నాయకులు, కార్యకర్తలు సోమవారం రిలేనిరహారదీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరంలో ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబునాయుడిని అక్రమంగా జైలుకు పంపి, ముఖ్యమంత్రి, మంత్రులు పైశాచిక ఆనదం పొందుతున్నారన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి పక్షపార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. కరువు, కాటకాలతో అల్లాడుతున్న పశ్చిమప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి చేయకుండా అలంకారప్రాయంగా ఉంచారన్నారు. పశ్చిమ ప్రకాశంలో సాగునీరు, తాగునీరు కరువై ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతోంటే వైసీపీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు కూడలేదన్నారు. చంద్రబాబును జైల్లో ఉంచి అక్రమ పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. ఈ దీక్షా శిబిరంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, పెద్దారవీడు టీడీపీ అధ్యక్షుడు ఎం శ్రీనివాసరెడ్డి, త్రిపురాంతకం మండల టీడీపీ అధ్యక్షుడు ఎం.వలరాజు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కందుల రామిరెడ్డి, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, పుల్లలచెరువు మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు శనగా నారాయణరెడ్డి, గొట్టం శ్రీనివాసరెడ్డి, అంబటి వీరారెడ్డి, బట్టు సుదాకరరెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జ్ మల్లెల అల్లూరరెడ్డి, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు పేరం నాగిరెడ్డి, సంజీవరెడ్డి, కందుల నారాయణరెడ్డి, నారువెంకట్రామిరెడ్డి, భూమిరెడ్డి రామిరెడ్డి, సీపీఐ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, టీడీపీ ముఖ్యనాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, వేగినాటి శ్రీను, కాకర్ల కోటయ్య, కొత్తమాసు సుబ్రహ్మణ్యం, కొత్త భాస్కర్, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు మాజీ ఎంపీపీ సుందరరావు, కోటా డేవిడ్, చేదూరి లక్ష్మయ్య, కిశోర్, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.