ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , First Publish Date - 2023-02-01T23:18:29+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆపార్టీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షు డు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివవరావు అన్నారు. బుధవారం నాగులపాలెంలో పర్యటించారు.

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

నాగులపాలెం(పర్చూరు), ఫిబ్రవరి 1: ప్రజా సమస్యల పరిష్కారం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆపార్టీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షు డు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివవరావు అన్నారు. బుధవారం మండ లంలోని నాగులపాలెంలో పర్యటించారు. గ్రామంతోపాటు పలుకాలనీ లను సందర్శించారు. అంబేడ్కర్‌ కాలనీలోని బాపిస్టు చర్చిలో ఏర్పా టుచేసిన ప్రత్యేక ప్రార్థనలో ఏలూరి పాల్గొన్నారు. ఈసందర్భంగా కాల నీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అదైర్య పడవద్దని, ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీడీపీ కృషిచేస్తుంద న్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించటం తథ్యమన్నా రు. తాను ఎప్పటికీ ప్రజలకు అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమం లో మానవ హరిబాబు, బాపట్ల నియోజకవర్గ ఎస్పీసెల్‌ అధ్యక్షుడు బేతపూడి సురేష్‌, యూత్‌ కార్యదర్శి నాగరాజు, సర్పంచ్‌ దాసి సుధారా ణి, కొల్లా శ్రీనివాసరావు(దాబా), పోట్రు శోభన్‌, కొల్లా శ్రీనివాసరావు (ఫ్యాక్టరీ), తలారి పోతురాజు, కట్టా డేవిడ్‌, దాసి కిరణ్‌, బాబూరావు, షేక్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ పటిష్టతకు కృషిచేయాలి

మార్టూరు, ఫిబ్రవరి 1: తెలుగుదేశం పార్టీ పటిష్టతకు యువత కృ షిచేయాలని ఆపార్టీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని ఇసుక దర్శి ఏలూరి క్యాంపు కార్యాలయంలో మార్టూరులోని అంబేడ్కర్‌ నగర్‌, ముస్లిం కాలనీలకు చెందిన యువకులు ఏలూరి సాంబశివరావును క లిశారు. ఈ సందర్భంగా కాలనీల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పలు సమస్యలను ఏలూరి దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ కాలనీల్లో ప్రజల సమస్యలను గుర్తించండి, వాటి పరిష్కారానికి మన వంతు కృషి చేద్దామన్నారు. కాలనీవాసులకు అన్ని వేళలా అండ గా ఉంటామని భరోసా కల్పించాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధి కారంలోకి రావడానికి యువకుల పట్టుదల, కృషి ఎంతో అవసరమని చెప్పారు.

అనంతరం మార్టూరులో అనారోగ్యానికి గురైన ఆలయ పూజారి నార్నె సాంబశివరావు ఇంటికి వెళ్లి పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చిట్టి, కామినేని జనార్దన్‌, తాటి నాగేశ్వరరావు, శివరాత్రి శ్రీను, మిన్నెకంటి రవికుమార్‌, కోటపాటి సురేష్‌, కామేపల్లి హరిబాబు, శానంపూడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:18:35+05:30 IST