పకడ్బందీగా పది పరీక్షలు

ABN , First Publish Date - 2023-03-19T02:12:24+05:30 IST

జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు.

పకడ్బందీగా పది పరీక్షలు

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు

చీఫ్‌లు, డీవోలకు కలెక్టర్‌ హెచ్చరిక

ఒంగోలు (విద్య), మార్చి 18 : జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో శనివారం పరీక్ష కేంద్రాల చీఫ్‌లు, డీవోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎవ్వరైనా అనైతికంగా విద్యార్థులకు సహాయం చేసేందుకు ప్రయత్నించినా, అలా చేస్తూ పట్టుబడినా విద్యాహక్కు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా పరీక్షలు కఠినంగా నిర్వహిస్తామనే సందేశం విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేయా లన్నారు. డ్యూటీ పాస్‌ లేకుండా ఎవరినీ కేంద్రాల్లోకి అను మతించరాదన్నారు. పరీక్ష కేంద్రాలన్నింటినీ నో సెల్‌ఫోన్‌ జోన్లుగా ప్రకటించినందున చీఫ్‌లతో సహా ఎవరి వద్ద సెల్‌ఫోన్లు ఉండరాదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చొని పరీక్ష రాయకూడదన్నారు. అన్ని కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఈవో పి.రమేష్‌, ఉప విద్యాధికారులు అనితారోజ్‌ రాణి, ఎ.చంద్రమౌళీశ్వర్‌, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ శివకుమార్‌, ఓపెన్‌ స్కూలు కోఆర్డినేటర్‌ బి.శ్రీనివాసరెడ్డి, డీసీఈబీ కార్యదర్శి వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T02:12:24+05:30 IST