Share News

జగన్‌ పాలనలో వేతనాలకు టీచర్ల ఎదురుచూపులు

ABN , Publish Date - Dec 17 , 2023 | 10:33 PM

జగన్‌ పాలనలో ఉ పాధ్యాయులు ప్రతి నెలా జీతాలు కోసం ఎ దురు చూడాల్సిన దుస్థితి నెలకుందని తూర్పు, రాయలసీమ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ అ న్నా రు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లో ఆదివారం ఎస్టీయూ ఆధ్వర్యంలో జిల్లా వై జ్ఞానిక సదస్సు జరిగింది.

జగన్‌ పాలనలో వేతనాలకు టీచర్ల ఎదురుచూపులు
ఎమ్మెల్సీ శ్రీకాంత్‌

విద్యా, వైజ్ఞానిక సదస్సులో ఎమ్మెల్సీ శ్రీకాంత్‌

కనిగిరి, డిసెంబరు 17: జగన్‌ పాలనలో ఉ పాధ్యాయులు ప్రతి నెలా జీతాలు కోసం ఎ దురు చూడాల్సిన దుస్థితి నెలకుందని తూర్పు, రాయలసీమ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ అ న్నా రు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లో ఆదివారం ఎస్టీయూ ఆధ్వర్యంలో జిల్లా వై జ్ఞానిక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ము ఖ్య అతిఽథిగా పాల్గొన్న శ్రీకాంత్‌ మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఉపాధ్యాయులకు డీఏ, ఐ ఆర్‌, ఇంక్రిమెంట్లు నగదు ఖాతాల్లో జమ అవుతాయిని ఎదురు చూసేవారన్నారు. కానీ వైసీ పీ పాలనలో ఒకటో తేదీన జీతం పడుతుందా లేదా అని ఉపాధ్యాయులు ఎదురు చూడాల్సిన దుస్థితికి జగన్‌ దిగజార్చారన్నారు. జగన్‌ను నమ్మి ఓట్లేసి మోసపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయవర్గమంతా టీడీపీని గెలిపించాలని కోరారు. చంద్రబాబు అధికారంలోకి వ స్తే ఉపాధ్యాయులకు మంచి రోజులు వస్తాయన్నారు. అదేవిధంగా ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.సాయి శ్రీనివా స్‌ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, దిక్కుమాలిన యాప్‌ల ద్వా రా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన సరి గ్గా చేయలేకపోతున్నారన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించడంతో విద్యా ప్ర మాణాలు పూర్తిగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రా మాల్లో బడులు మూతపడడంతో గ్రామీణ విద్యార్థులకు విద్య దూరం గా, భారంగా మారిందన్నారు. వేల సంఖ్యలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర విధ్యాశా ఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌ప్రకాష్‌ పాఠశాలల్లో తనిఖీ లు చేసి ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురి చేయడం తగదన్నారు. ఉపాధ్యాయులు బోధనాపరమైన పనులు మానేసి బోధనేతర పనులు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీపీఎస్‌ రద్దు విషయంలో జగన్‌ మాట తప్పారన్నారు. తొలుత జాతీయజెండా, ఎస్టీయూ పతాకావిష్కరణను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జీ సంజీవి, ఎ స్టీయూ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివా స్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ ప్రసంగించగా, ఎస్టీ యూ జిల్లా అధ్యక్షుడు దాసరి శ్రీనివాసు లు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఆరు మండలాల ఎంఈవోలు, సీపీఐ నాయకులు, మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌, బృంగి సుబ్రహ్మ ణ్యం, కనిగిరి జోన్‌ ఎస్టీయూ నాయకలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 10:33 PM