బద్వేల్‌కు బయల్దేరిన టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2023-06-11T23:27:45+05:30 IST
టీడీపీ జాతీయ ప్ర ధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాద యాత్ర సాగుతున్న కడప జిల్లా బద్వేల్‌కు టీ డీపీ ఇన్‌చార్జిలు తరలివెళ్లారు.
లోకేష్‌కు పాదయాత్రలో ఇన్‌చార్జిలు
పామూరు, జూన్ 11 : టీడీపీ జాతీయ ప్ర ధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాద యాత్ర సాగుతున్న కడప జిల్లా బద్వేల్‌కు టీ డీపీ ఇన్‌చార్జిలు తరలివెళ్లారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ ఇన్‌చార్జిలు ఆదివారం పా మూరు జాతీయ రహదారి మీదుగా బద్వేల్‌కు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా పామూరు జాతీయ రహదరి తూర్పు బైపాస్ వద్ద కాసేపు వారు ఆగారు. బద్వేల్‌కు తరళివెళ్లిన వారిలో కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి, కనిగిరి, వైపాలెం, ఎస్‌ఎన్‌పాడు, కందుకూరు ఇన్‌చార్జిలు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, గూడూరి ఎరిక్షన్‌బాబు, బీ ఎన్ విజయ్‌కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు తో పాటు, పారిశ్రామికవేత్త కోటపాటి జనార్దన్ రావు, దామచర్ల సత్య, గుర్రం వెంకటేశ్వర్లు ఉ న్నారు. వారంతో లోకేష్ పాదయాత్రలో పాల్గొంటారు. దుత్తలూరులో మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు జరుగుతున్న ఆత్మీయ సన్మానం సందర్భంగా టీడీపీ ఇన్‌చార్జిలు ఆ యన్ని మర్యాదపూర్వకంగా కలిశారు.