బలహీన వర్గాలకు అండ టీడీపీ జెండా

ABN , First Publish Date - 2023-09-02T00:41:20+05:30 IST

బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ ముందు నుంచి వెన్నుదన్నుగా ఉండి రాజకీయ చైతన్యం కల్పించిందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే భవిష్యత్‌ బంగారుమయం అవుతుందని టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షులు డాక్టర్‌ నూకసాని బాలాజి తెలిపారు. మండలంలోని బోడవాడ పంచాయతీ అక్కంపేట గ్రామంలో మాజీ జడ్పీటీసీ ఎం. హుసేన్‌రావు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు చేపట్టిన ప్రతి పఽథకాన్ని రద్దు చేయడమే జగన్‌ లక్ష్యమని, స్థానిక సంస్థల నిధులను

బలహీన వర్గాలకు అండ టీడీపీ జెండా
పఽథకాల బాండు పత్రాలను అందచేస్తున్న బాలాజీ ,ఉగ్ర, కోటపాటి, పువ్వాడి

వైసీపీ నేతల తీరు నచ్చక టీడీపీలో చేరిన సర్పంచ్‌

పామూరు, సెప్టెంబరు 1 : బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ ముందు నుంచి వెన్నుదన్నుగా ఉండి రాజకీయ చైతన్యం కల్పించిందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే భవిష్యత్‌ బంగారుమయం అవుతుందని టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షులు డాక్టర్‌ నూకసాని బాలాజి తెలిపారు. మండలంలోని బోడవాడ పంచాయతీ అక్కంపేట గ్రామంలో మాజీ జడ్పీటీసీ ఎం. హుసేన్‌రావు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు చేపట్టిన ప్రతి పఽథకాన్ని రద్దు చేయడమే జగన్‌ లక్ష్యమని, స్థానిక సంస్థల నిధులను పక్క దారి మళ్లిస్తూ పంచాయతీ రాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశాడని అన్నారు. లోకేష్‌ పాదయాత్రకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని, జగన్‌ దుర్మార్గ పాలనపట్ల విసుగు చెందిన ప్రజలు చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఉగ్రను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. టీడీపీ కనిగిరి ఇన్‌చార్జి ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ జగన్‌ మాయమాటలు నమ్మిమోసపోయామని, సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు. అక్కంపేట గ్రామాన్ని నేను దత్తత తీసుకొని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, అభివృద్ధి చేసిన తరువాతనే మళ్లీఓట్లకు వస్తానని అన్నారు. సంపద సృష్టించే చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నామన్న ధైర్యంతో హామీలు ఇస్తున్నానన్నారు. అనంతరం భవిషత్తుకు గ్యారెంటీ చంద్రబాబు ష్యూరిటీ పత్రాలను ఆవిష్కరించారు. పత్రాలలో ఉన్న పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి వాటికి సంబంధించిన బాండ్‌ పేపర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల, పట్టణ గ్రామ పార్టీ అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, షేక్‌ ఖాజారహంతుల్లా, డి. కోటిలింగం, కోటపాటి జనార్దనరావు, రాష్ట్ర నాయకులు అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, ఎం. గంగరాజు, మాజీ ఎంపీపీ జి. దశరఽథరామయ్య, షరీఫ్‌, ఎంపీటీసీ బొల్లా నరసింహారావు, గ్రామ సర్పంచ్‌ దాసరి చిన మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

భారీ బైక్‌ ర్యాలీ

బహిరంగ సభకు ముందుగా సుమారు 150 బైకులు, 25 కార్లతో బోడవాడ నుంచి అక్కంపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా మహిళలు మంగళహారతులతో ఉగ్ర, ఇతర నేతలకు స్వాగతం పలికారు.

Updated Date - 2023-09-02T00:41:20+05:30 IST