టీడీపీ, జనసేన పార్టీలదే విజయం
ABN , Publish Date - Dec 24 , 2023 | 11:59 PM
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయంలో శనివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం ముగింపు బహిరంగ సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
దర్శి, డిసెంబరు 24 : వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయంలో శనివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం ముగింపు బహిరంగ సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పె ద్దసంఖ్యలో ప్రజలు హాజరై చరిత్ర సృష్టించారన్నారు. 12 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నా వైసీపీ పా కులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వైసీపీ అరాచకపాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమం లో టీడీపీ మండల అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్ చైర్మన్‌లు జీ స్టీవెన్, తలారి కోటయ్య, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శి సంగా తిరుపతిరావు, తెలుగు మహిళ అధికార ప్రతినిధి ఎం.శోభారాణి, నాయకులు పారా గాలయ్య, ఐటీడీపీ ఇన్‌చార్జి సందు రామయ్య, ఎస్ చంద్రా, కల్లూరి సుబ్బు పాల్గొన్నారు.
దర్శి అసెంబ్లీ టికెట్‌పై నిర్ణయం తీసుకోలేదు
దర్శి అసెంబ్లీ టికెట్‌పై ఇప్పటి వరకు టీడీపీ, జనసేన పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు నాదెండ్ల బ్రహ్మంచౌదరి శనివారం ప్రకటనలో తెలిపారు. కొంతమంది వ్య క్తులు తమకు టికెట్ ఖరారు అయిందని చేస్తున్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో టీడీపీ, జనసేన పార్టీల అధినాయకులు తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన వివరించారు.