పన్నులు చెల్లించని ఇళ్లకు కొళాయి కనెక్షన్ తొలగించాలి
ABN , First Publish Date - 2023-03-02T23:27:30+05:30 IST
ఆస్తి పన్ను, నీటి పన్నులు దీర్ఘకాలికంగా చెల్లించకుండా ఉన్న యజమానులకు రెడ్‌నోటీసులు జారీ చేయాలని, అలాగే గృహాలకు తాగునీటి కొళాయిలు తొలగించాలని నగర కమిషనర్ ఎం.వెంక టేశ్వరరావు ఆదేశించారు.
నగర కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశం
ఒంగోలు (కార్పొరేషన్), మార్చి 2: ఆస్తి పన్ను, నీటి పన్నులు దీర్ఘకాలికంగా చెల్లించకుండా ఉన్న యజమానులకు రెడ్‌నోటీసులు జారీ చేయాలని, అలాగే గృహాలకు తాగునీటి కొళాయిలు తొలగించాలని నగర కమిషనర్ ఎం.వెంక టేశ్వరరావు ఆదేశించారు. గురువారం పన్నుల వసూలు స్పెషల్‌డ్రైవ్‌లో భాగం గా ఆయన నగరంలోని కర్నూలురోడ్‌లో సచివాలయ సిబ్బందితో కలిసి పర్యటి ంచారు. ఈ సందర్భంగా బకాయి ఉన్న జాబితా ఆధారంగా సంబంధిత యజ మానులతో నేరుగా మాట్లాడారు. నగర అభివృద్ధిలో కీలకమైన ఆస్తి, నీటి ప న్నుల సకాలంలో చెల్లించాలని ఆయన కోరారు. గత కొన్నేళ్లుగా అధికమొత్తం లో చెల్లించని వారితో మాట్లాడిన కమిషనర్, త్వరితగతిన చెల్లించాలన్నారు. అలాగే రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సెక్రటరీలు ఉదాసీనంగా వ్యవహరించ కుండా వసూళ్లు చేపట్టాలని చెప్పారు. కార్యాలయ సెలవురోజుల్లో కూడా ప న్నులు కట్టించుకోవాలని సూచించారు. అలాగే పలు సచివాలయాలను సంద ర్శించి రికార్డులను పరిశీలించారు. భూ రీసర్వే వేగవంతం చేయాలని ఆదేశిం చారు. ఈ విషయంలో దాదాపుగా సచివాలయ సెక్రటీలు నిర్లక్ష్యంగా ఉన్నార ని, ప్రతిరోజు ఆర్డీఎంఏకి నివేదిక పంపించాల్సి ఉందన్నారు. త్వరితగతిన లక్ష్యా లు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.