స్విమ్మింగ్ వీరుడు చందవరం యువకుడు
ABN , First Publish Date - 2023-11-21T22:04:42+05:30 IST
స్విమ్మింగ్‌పై ఉన్న ఆశక్తి ఆ యువకుడిని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. దాదాపు 12 ఏళ్ల క్రితం ఆక్వా స్పోర్ట్స్ క్రీడా సాధికారిక సంస్థ (శాప్) నిర్వహించిన స్వి మ్మింగ్ అకాడమీలో చేరిన మండలంలోని చందవరం గ్రామానికి చెందిన యోగి రా ములు కోచ్‌ల శిక్షణలో స్వి మ్మింగ్‌లో చిత్తశుద్ధితో సాధన చేశాడు. ఎటువంటి ఇతర ఆ లోచనలకు తావులేకుండా స్విమ్మింగ్ పైనే దృష్టి సారించి స్విమ్మింగ్‌లో తనకు ఎంతో ఇష్టమైన బట్టర్‌ప్లై స్టయిల్‌ను మెరుగుపర్చుకునేందుకు ముమ్మరంగా సాధన చేశాడు.

రాష్ట్ర స్థాయిలో అనేక పతకాలు సొంతం
జిల్లా తరుపున జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
మంగుళూరులో ఈనెల 24 నుంచి పాల్గొనే అవకాశం
దొనకొండ, నవంబరు 21 : స్విమ్మింగ్‌పై ఉన్న ఆశక్తి ఆ యువకుడిని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. దాదాపు 12 ఏళ్ల క్రితం ఆక్వా స్పోర్ట్స్ క్రీడా సాధికారిక సంస్థ (శాప్) నిర్వహించిన స్వి మ్మింగ్ అకాడమీలో చేరిన మండలంలోని చందవరం గ్రామానికి చెందిన యోగి రా ములు కోచ్‌ల శిక్షణలో స్వి మ్మింగ్‌లో చిత్తశుద్ధితో సాధన చేశాడు. ఎటువంటి ఇతర ఆ లోచనలకు తావులేకుండా స్విమ్మింగ్ పైనే దృష్టి సారించి స్విమ్మింగ్‌లో తనకు ఎంతో ఇష్టమైన బట్టర్‌ప్లై స్టయిల్‌ను మెరుగుపర్చుకునేందుకు ముమ్మరంగా సాధన చేశాడు. ఫలితంగా స్విమ్మింగ్ పోటీల్లో పతకాల సాధనలో దిట్టగా నిలిచాడు. చందవరంలో యోగి రాములు కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. రాములు చందవరంలో 3వ తరగతి వరకు చదువుకొని అనంతరం తర్లుపాడులోని హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగించాడు. చదువుకునే రోజుల్లో క్రీడల పట్ల ఆశక్తిగల రాములు రన్నింగ్‌లో ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర స్థాయికి ఎంపికై పోటీల్లో పాల్గొని విశాఖలోని శాప్ హాస్టల్‌కు ఎంపికయ్యాడు. అక్కడ స్విమ్మింగ్ క్రీడను ఎంచుకొని కుటుంబ పరంగా ఆర్థిక స్థోమత లేకున్నా స్విమ్మింగ్ క్రీడను నమ్ముకొని ముందుకు సాగుతున్న రాములు రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో 200, 100, 50 మీటర్లు బటర్‌ప్లై స్విమ్మింగ్‌లో తిరుగులేని స్విమ్మర్‌గా గుర్తింపు పొంది పతకాలను సొంతం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో 2012లో పూణేలో జరిగిన 66వ నేషనల్, 2013లో త్రివేండ్రంలో జరిగిన 67వ నేషనల్, 2014లో జరిగిన 68వ సీనియర్ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని త్రుటిలో పతకాలు స్వల్ప తేడాతో చేజారినట్లు తెలిపారు. ఎట్టకేలకు జాతీయ స్థాయిలో పతకం సాధించాలనే పట్టుదలతో ఈనెల 24 నుంచి 26 వరకు కర్నాటక రాష్ట్రం మంగళూరులో స్వి మ్మింగ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా వారు నిర్వహించే 2023 19వ నేషనల్ మా స్టర్స్ చాంపియన్ షిప్ పోటీలలో పోటీ పడేందుకు రాములు కంపికయ్యాడు.
నేషనల్‌లో పతకం సాధించటమే లక్ష్యం - యోగి రాములు
ఈనెల 24 నుంచి కర్నాటక రాష్ట్రంలోని మంగళూరులో నిర్వహించే నేషనల్ మా స్టర్స్ చాంపియన్‌షి్‌ప పతకం ప్రకాశం జిల్లా తరఫున సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను. కుటుంబ పోషణ నిమిత్తం స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే ధ్యేయం. పట్టుదలతో పలువురి ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నాను.