అంగన్‌వాడీ కార్యకర్త అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2023-09-30T00:49:06+05:30 IST
న్న లూరు మండలంలోని వెల్లటూరు గ్రామ పంచా యతీ పరిధిలోని మంగపతివారిపాలెం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త కొప్పోలు కల్యాణి (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందా రు.
వేధిస్తున్న లారీ డ్రైవర్
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు
పొన్నలూరు(కొండపి), సెప్టెంబరు 29 : పొన్న లూరు మండలంలోని వెల్లటూరు గ్రామ పంచా యతీ పరిధిలోని మంగపతివారిపాలెం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త కొప్పోలు కల్యాణి (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందా రు. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు.. కల్యాణి వెల్లటూరులోని అంగన్‌వాడీకేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆమెకు భర్త సురేష్, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మంగపతివారిపాలెంలోని ఇంటి ఆవరణలో యథాప్రకారం గురువారం రాత్రి అంద రూ నిద్రించారు. శుక్రవారం ఉదయం భర్త లేచి చూసేసరికి కల్యాణి స్కార్ఫ్‌తో వసారాకు ఉరేసుకొని వేలాడుతూ కన్పించింది. దీంతో ఆయన కిందకు దిం చి చూడగా అప్పటికే మృతి చెంది ఉంది. కల్యాణి తల్లి కట్టా ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజారావు తెలి పారు. ఘటనా స్థలాన్ని సీఐ పాండురంగారావు పరి శీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
లారీ డ్రైవర్‌పై అనుమానాలు
కాగా అంగన్‌వాడీ కార్యకర్త కల్యాణి మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఎస్సీకాలనీకి చెందిన లారీ డ్రైవర్ రాముడు కొంతకాలంగా వేధిస్తున్నట్లు వారు చెప్తున్నారు. గ తంలో గ్రామ పెద్దలు కూడా పంచాయితీ చేసి రా ముడును మందలించి పంపారని తెలిసింది. అయి నా అతను వేధింపులకు పాల్పడుతుండటంతో జూ లైలో కల్యాణి పో లీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేశారు. పో లీసులు రాము డుపై కేసు నమో దు చేసి కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు స మాచారం. గురు వారం కూడా క ల్యాణిని ఉద్దేశించి ఆతను సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలతోపాటు, ఆమె క్యారెక్టర్‌ను కించపరుస్తూ పోస్టులు పెట్టాడని అంటున్నారు. దీంతో మనస్తాపా నికి గురై కల్యాణి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు.