Share News

సూపర్‌ సిక్స్‌ పఽథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , Publish Date - Dec 26 , 2023 | 10:47 PM

తెలుగుదేశం పా ర్టీ అధికారం చేపట్టిన వెంటనే ప్రజలకు అందిం చే సూపర్‌ సిక్స్‌ పథకాలను ఇంటింటికీ వివరిం చాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. మార్టూరు మండలం జొన్నతాళిలోని క్యాంపు కా ర్యాలయంలో మంగళవారం పంగులూరు మం డలంలోని ఆరికట్లవారిపాలెం, బూదవాడ, జనక వరం, తూర్పు తక్కెళ్ళపాడు, నూజెళ్ళపళ్ళి గ్రా మాల పార్టీ నేతలు, వివిధ విభాగాల ఇన్‌చార్జ్‌లతో పలు అంశాలపై ఎమ్మెల్యే గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాలఅన్నారు.

సూపర్‌ సిక్స్‌ పఽథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఆరికట్లవారిపాలెం నేతలతో సమీక్ష చేస్తున్న ఎమ్మెల్యే గొట్టిపాటి

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

పంగులూరు, డిసెంబరు 26: తెలుగుదేశం పా ర్టీ అధికారం చేపట్టిన వెంటనే ప్రజలకు అందిం చే సూపర్‌ సిక్స్‌ పథకాలను ఇంటింటికీ వివరిం చాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. మార్టూరు మండలం జొన్నతాళిలోని క్యాంపు కా ర్యాలయంలో మంగళవారం పంగులూరు మం డలంలోని ఆరికట్లవారిపాలెం, బూదవాడ, జనక వరం, తూర్పు తక్కెళ్ళపాడు, నూజెళ్ళపళ్ళి గ్రా మాల పార్టీ నేతలు, వివిధ విభాగాల ఇన్‌చార్జ్‌లతో పలు అంశాలపై ఎమ్మెల్యే గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాలఅన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివ రించాలన్నారు. వైసీపీఐ ప్రజలలో అసంతృప్తి, అసహనం నానాటికీ పెరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీని సాగనంపేదుకు ప్ర జలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికుల తో పాటు తాను నియమించిన వలం టీర్లు సహితం రోడ్డె క్కారన్నారు. రైతు భరోసా ఏడాదికి రూ.12,500 చెల్లి స్తానని చెప్పి అధి కారం చేపట్టిన అ నంతరం రాష్ట్ర వాటా రూ.7500కు కుదించారన్నారు. 8 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై రూ.64 వేలకోట్ల విద్యుత్‌ భారం మోపడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిఽధులు రూ.1.14 లక్షల కోట్లు దారి మళ్లించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 120 సంక్షేమ పథకాలను రద్దుచేశారని చెప్పారు. రద్దుల ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి పేరు గడించాడని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పా ర్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 10:47 PM