విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచాలి
ABN , First Publish Date - 2023-02-01T01:16:15+05:30 IST
దేశ ప్రతిష్ఠను పెంచే విధంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచాలని మార్కాపురం శాసన సభ్యుడు కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.
పొదిలి రూరల్, జనవరి 31 : దేశ ప్రతిష్ఠను పెంచే విధంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచాలని మార్కాపురం శాసన సభ్యుడు కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ యంగ్‌మైండ్ కార్యక్రమం లో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భావి తరాల విద్యార్థుల కోసం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అయితే వారిలోని ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించాలని సూచించారు. ప్రతి విద్యార్థిలో దేశ ప్రతిష్టలు పెంచేటువంటి కళలు ఎన్నో మిళితమై ఉంటాయ న్నారు. అలాంటి వారిని ఉపాధ్యాయులు గుర్తించి వారిని పోత్సహించాలన్నారు. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయు లకే సాధ్యమౌతుందన్నారు. ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే నిరంతరం కృషి పట్టుదల విద్యార్థుల్లో ఉండాలన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహు మతులు అందజేశారు.
మైక్‌సెట్ వితరణ
అహాబుల్లా బేగ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. పాఠశాలకు అవసరమైన రూ.25వేల విలువైన మైకును కరిముల్లాబేగ్ ఎమ్మెల్యే ద్వారా బహుకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో చంద్రమౌళి, పొదిలి, మర్రిపూడి ఎంఈవోలు శ్రీనివాసరెడ్డి, రంగయ్య, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తారావాణి, సీఐ సుధాకర్‌రావు, మార్కాపురం ఏఎంసీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుజ్జుల రమణారెడ్డి, సాయి రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ కోవెలకుంట్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.