Share News

కనిగిరిప్రాంత విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2023-11-26T23:06:50+05:30 IST

కనిగిరి ప్రాంతానికి చెందిన విద్యార్థినీవిద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో రాష్ట్ర 4వ జీ-జిట్స్‌ 2023 కరాటే చాంపియన్‌షి్‌ప పోటీలను డాక్టర్‌ ఉగ్ర ముఖ్య అతిథిగా పాల్గొని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తొలుత రాష్ట్ర స్థాయి కబడ్డీ, ఖోఖో పోటీలను నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు.

కనిగిరిప్రాంత విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి
విజేతలతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, నవంబరు 26 : కనిగిరి ప్రాంతానికి చెందిన విద్యార్థినీవిద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో రాష్ట్ర 4వ జీ-జిట్స్‌ 2023 కరాటే చాంపియన్‌షి్‌ప పోటీలను డాక్టర్‌ ఉగ్ర ముఖ్య అతిథిగా పాల్గొని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తొలుత రాష్ట్ర స్థాయి కబడ్డీ, ఖోఖో పోటీలను నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. ఆనాటి నుంచి కనిగిరి ప్రాంతంలో క్రీడాకారులు ఎన్నో క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించి కనిగిరి ప్రాంతానికి గుర్తింపు తెస్తున్నందుకు తనకెంతో సంతోషంగా ఉంటుందన్నారు. కృషి, పట్టుదల లేనిదే ఏ రంగంలోనూ రాణించలేమన్నారు. కనిగిరి ప్రాంతానికి చెందిన యువత, భావితరాలు పట్టుదలతోపాటు పోరాట పటిమ అలవర్చుకోవాలన్నారు. అదేవిధంగా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, దుర్మార్గాలు చూస్తుంటే ఆందోళనగా ఉంటుందన్నారు. ఇలాంటి రోజుల్లో చిన్ననాటి నుంచే బాలికలను సివంగిలా తయారు కావాలన్నారు. అందుకు కరాటే శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. ఆడపిల్లలను కరాటే శిక్షణకు ప్రోత్సహించే తల్లిదండ్రులను అభి నందించారు. కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్‌ ఉండడం వలన ఎముకల్లో పటుత్వం కోల్పోతుండటం సహజమని, అందుకు కరాటే శిక్షణ ఎముకలను ఎంతో దృఢత్వంగా తయారవుతాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కనిగిరిలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం తనకు ఆ సహకారాన్ని ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన జీ-జిట్స్‌ చాంపియన్‌ షిప్‌ నిర్మాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కనిగిరి ప్రాంతంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ కరాటేలో కనిగిరికి కూడా గుర్తింపు, స్థానాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్న కనిగిరి కరాటే మాస్టర్‌ యాసిన్‌ను డాక్టర్‌ ఉగ్ర అభినందిస్తూ తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో 8 జిల్లాలకు చెందిన జూనియర్‌, సబ్‌జూనియర్‌, సీనియర్‌ జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో కరాటే పోటీల్లో పాల్గొన్న విజేతలను డాక్టర్‌ ఉగ్ర సత్కరించి మెమెంటోలను అందచేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, ఐటీడీపీ నాయకులు జంషీర్‌, కేవీఎ్‌సగౌడ్‌, కొట్టే ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-26T23:06:53+05:30 IST