పుల్లలచెరువులో ఈదురు గాలుల బీభత్సం

ABN , First Publish Date - 2023-05-19T01:32:53+05:30 IST

పుల్లలచెరువు మండ లంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన స్వల్ప వర్షం కురిసింది.

పుల్లలచెరువులో ఈదురు గాలుల బీభత్సం

పుల్లలచెరువు, మే 18: పుల్లలచెరువు మండ లంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన స్వల్ప వర్షం కురిసింది. దీంతో వేగంగా వీచినా గాలులలతో మండల కేంద్రమైన పుల్లల చెరువు , ఉమ్మడివరం , రచకొండ, కవలకుంట్ల, గంగవరం పరిసర గ్రామాల్లో వందల చెట్లు , విద్యుత్‌ స్తంభాలు ఒరిగిపోయాయి. పొలాల్లోని వ్యవసాయ స్తంభాలు, లైన్లు విరిగి కింద పడ్డాయి. దీంతో 20 నిమిషాల పాటు గాలులు బీభత్సం సృష్టించడంతో పొలాల్లోని ప్రజలు, పశువుల కాపరులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యుత్‌స్తంభాలు, చెట్లు ఎక్కడికక్కడ విగిరి రోడ్డున పడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి వరం రోడ్డులో భారీ వృక్షాలు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలు స్తంభించాయి. పుల్లల చెరువు ఎస్సీపాలెంలో విద్యుత్‌ స్తంభం విగిరి పడింది. దీంతో విద్యుత్‌ నిలిపొయింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వేపచెట్టు విరిగి గేటు మీద పడింది. ప్రధానంగా పుల్లలచెరువులో విద్యుత్‌ సరాఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో భారీ ఎత్తున వ్యవసాయ స్తంభాలు విరిగి పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-05-19T01:32:53+05:30 IST