శానంపూడి బీఎల్వోకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఎలక్ర్టోరల్‌ అవార్డు

ABN , First Publish Date - 2023-01-25T00:53:40+05:30 IST

మండలంలోని శానంపూడి బీఎల్వోగా పనిచేస్తున్న ఏఎన్‌ఎం నాదెండ్ల సాయిశ్రీకి రాష్ట్రస్థాయి ఉత్తమ ఎలకో్ట్రరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు లభించింది.

శానంపూడి బీఎల్వోకు  రాష్ట్రస్థాయి ఉత్తమ  ఎలక్ర్టోరల్‌ అవార్డు

నూరుశాతం ఓట్లకు ఆధార్‌ అనుసంధానం

సాయిశ్రీని అభినందించిన అధికారులు

సింగరాయకొండ, జనవరి 24 : మండలంలోని శానంపూడి బీఎల్వోగా పనిచేస్తున్న ఏఎన్‌ఎం నాదెండ్ల సాయిశ్రీకి రాష్ట్రస్థాయి ఉత్తమ ఎలకో్ట్రరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు లభించింది. 2022 ఏడాదికి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ పనితీరును కనబర్చిన కలెక్టర్లు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలకు రాష్ట్ర చీఫ్‌ ఎలకో్ట్రరల్‌ అధికారి ముకేష్‌కుమార్‌మీనా ఈ అవార్డులను ప్రకటించారు. వారిలో జిల్లా నుంచి శానంపూడి-235 బూత్‌ లెవల్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎం సాయిశ్రీ ఉన్నారు. ఆమె పనిచేస్తున్న బూత్‌లో మొత్తం 669 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 42 మంది మృతి చెందారు. ఇద్దరు వలస వెళ్లారు. మిగిలిన 625 మంది ఓటరు కార్డులకు వారి ఆధార్‌ను అనుసంధానం (నూరుశాతం) చేశారు. దీంతో ఆమెను రాష్ట్ర ఉత్తమ ఎలకో్ట్రరల్‌ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సాయిశ్రీని మండలంలో పలువురు అధికారులు అభినందించారు.

Updated Date - 2023-01-25T00:53:40+05:30 IST