జేసీగా శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరణ

ABN , First Publish Date - 2023-04-13T01:05:28+05:30 IST

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా డాక్టర్‌ కె.శ్రీనివాసులు బుధవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు.

జేసీగా శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరణ

పలుశాఖల అధికారులతో సమీక్ష

ఆయన్ను కలిసి అభినందనలు తెలిపిన అధికారులు, ఉద్యోగులు

ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 12 : జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా డాక్టర్‌ కె.శ్రీనివాసులు బుధవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జేసీగా పనిచేస్తున్న ఆయన్ను ఐదు రోజుల క్రితం జిల్లాకు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. బుధవారం మధ్యాహ్నం ఒంగోలు చేరుకున్న శ్రీనివాసులుకు రెవెన్యూ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అధికారులు, సూపరిం టెండెంట్లు, రెవెన్యూ ఉద్యోగులు కలిసి అభినందించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న రీసర్వే, స్టోన్‌ ప్లాంటేషన్‌పై సర్వేశాఖ ఉద్యోగులతో శ్రీనివాసులు సమీక్ష చేశారు. అనంతరం కలెక్టరేట్‌ విభాగ పర్యవేక్షకులతో సమావేశమయ్యారు. ఒంగోలు తహసీల్దార్‌ మురళి, కార్పొరేషన్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, కలెక్టరేట్‌ యూనిట్‌ అధ్యక్షుడు ఊతకోలు శ్రీనివాసులు తోపాటు పలువురు జేసీని కలిసి అభినందించారు. కాగా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మార్కాపురంలో సీఎం పర్యటన అనంతరం ఒంగోలు వచ్చాక జేసీ మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - 2023-04-13T01:05:35+05:30 IST