ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2023-02-06T22:48:05+05:30 IST

అద్దంకి పట్టణంలో ట్రాఫిక్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా పట్టణం పరిధిలోని నామ్‌ రోడ్డులో పలు కూడలి ప్రాంతాలలో తరచూ ట్రాఫిక్‌ సమస్య ఏర్పడ టంతోపాటు వాహనాలు అడ్డదిడ్డంగా నడుపుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి

నామ్‌ రోడ్డులో ఐదుచోట్ల పోలీసుల విధులు

అద్దంకివాసులకు తీరనున్న కష్టాలు

అద్దంకి, ఫిబ్రవరి 6: అద్దంకి పట్టణంలో ట్రాఫిక్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా పట్టణం పరిధిలోని నామ్‌ రోడ్డులో పలు కూడలి ప్రాంతాలలో తరచూ ట్రాఫిక్‌ సమస్య ఏర్పడ టంతోపాటు వాహనాలు అడ్డదిడ్డంగా నడుపుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో పలుసార్లు ప్రమాదాలు జరిగినా పోలీస్‌ అధికారులు అంతగా స్పందించిన దాఖలాలు లేవు. ఈనెల 1వ తేది నుంచి అద్దంకి టౌన్‌ సీఐగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. 2వ తేది నుంచి పట్టణంలోని కూడలి ప్రాంతాలలో రద్దీ సమయాలలో పోలీసులు విధులు నిర్వహించేలా ఏర్పాటు చేశారు.

పట్టణ పరిధిలోని నామ్‌ రోడ్డులో రామ్‌నగర్‌, బంగ్లా రోడ్డు, పాత బస్టాండ్‌ సెంటర్‌, ఆర్టీసీ బస్టాండ్‌, భవానిసెంటర్‌, కలవకూరు క్రాస్‌ రోడ్డు తదితర కూడలి ప్రాంతాలలో పోలీసులు విధులు నిర్వహి స్తున్నారు. దీంతో నామ్‌ రోడ్డు లో వాహనాల వేగం తగ్గటంతో పాటు రోడ్డు దాటే సమయంలో కూడా ట్రాఫిక్‌ సమస్యకు కొంత మేర పరిష్కారం ఏర్పడింది. అయితే, రోడ్డు మార్జిన్‌లో ఆక్రమణల తొలగిం పుపై పోలీసులు, మున్సిపల్‌ అధికారులు సమన్వయం ముందుకు సాగితే ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

Updated Date - 2023-02-06T22:48:16+05:30 IST