స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ABN , First Publish Date - 2023-09-26T00:29:56+05:30 IST

స్పందనలో వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌, స్పందన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలను విన్నవించారు. ఆయా సమస్యలపై కలెక్టర్‌ మాట్లాడుతూ సోమవారం జరిగిన స్పందనలో 332 అర్జీలు వచ్చాయన్నారు. వచ్చిన అర్జీలు రీ ఓపెన్‌ కాకుండా చూడాలన్నారు.

స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
స్పందనలో కలెక్టర్‌ దినే్‌షకుమార్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 25 : స్పందనలో వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌, స్పందన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలను విన్నవించారు. ఆయా సమస్యలపై కలెక్టర్‌ మాట్లాడుతూ సోమవారం జరిగిన స్పందనలో 332 అర్జీలు వచ్చాయన్నారు. వచ్చిన అర్జీలు రీ ఓపెన్‌ కాకుండా చూడాలన్నారు. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని కచ్చితంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో శ్రీలత,స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు ఉమాదేవి, లోకేశ్వరరావు, వరకుమార్‌ తదితరులు ఉన్నారు.

సంత నూతలపాడు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేసి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సంతనూతలపాడుకు చెందిన కుంచాల బ్రహ్మయ్య మరికొందరు ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేసి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

తమ గ్రామంలోని చెరువు నిండి పక్కనే ఉన్న 60 ఎకరాల పంట పొలాలు మునిగిపోతున్నాయని కంభం మండలం తురిమెళ్లకు చెందిన రామ్‌ప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. పంట పొలాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

272 సర్వేనెంబరులో పొజిషన్‌లో ఎవరున్నారో వివరాలు ఇవ్వడం లేదని కనిగిరి మండలం పునుగోడుకు చెందిన సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. అనేక సార్లు రెవెన్యూ అధికారులను కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. అందువల్ల ఆ సర్వేనెంబరు పొజిషన్‌ ఇప్పించాలని కోరారు.

గ్రామంలో గేదెలు అనారోగ్యంతో మృతిచెందుతున్నా వెటర్నరీ అసిస్టెంట్‌ పట్టించుకోవడం లేదని కొమరోలు మండలం నల్లగుంటకు చెందిన వై. రమణారెడ్డి ఫిర్యాదు చేశారు. పశువులు వ్యాదులు బారిన పడుతున్నాయని సచివాలయంలో ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని అందులో పేర్కొన్నారు. ఇలా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు సమస్యలను విన్నవించారు.

Updated Date - 2023-09-26T00:29:56+05:30 IST