మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు !

ABN , First Publish Date - 2023-03-19T00:25:17+05:30 IST

వరి సాగు చేసిన రైతులు తమ ధాన్యం అమ్ముకు నేందుకు ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికే నూర్పిళ్లు పూర్తి చేసి ధాన్యం బస్తాలు ఇళ్లకు చేర్చుకున్నారు.

 మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు !

రోడ్లు..పొలాల్లో రాసులుగా ఉన్న వడ్లు

వాతావరణ మార్పులతో రైతుల్లో భయాందోళన పట్టించుకోని అధికారులు

నాగులుప్పలపాడు(ఒంగోలురూరల్‌), మార్చి 18: వరి సాగు చేసిన రైతులు తమ ధాన్యం అమ్ముకు నేందుకు ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికే నూర్పిళ్లు పూర్తి చేసి ధాన్యం బస్తాలు ఇళ్లకు చేర్చుకున్నారు. అయితే ప్రభుత్వం కొన్నిచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోలులో వేగం లేక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీ సుకున్న అప్పుల చెల్లించేందుకు ప్రైవేటు వ్యాపారు లకు వచ్చినకాడికి అమ్ముకుంటున్నారు. దీంతో వా రు నష్టపోతున్నారు. ప్రధానంగా నాగులుప్పలపాడు మండలం కనపర్తి ఎత్తిపోతల పథకం కింద రైతు లు 3వేల ఎకరాల్లో వరిసాగు చేపట్టారు. కన పర్తి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చే సి 20రోజులు అయ్యింది. అయినా ఇప్పటి వరకు కే వ లం 10లోడులు మాత్రమే రైతుల వద్ద నుంచి కొ నుగోలు చేశారు. కనపర్తి, దాసరివారిపాలెం, వినో దరాయునివారిపాలెం, అమ్మనబ్రోలు రైతుల కనప ర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో ఉన్నా రు. ఇప్పడు రైతుల వద్ద భారీగా ధాన్యం నిల్వలు ఉన్నాయి. వాటిని నిల్వ చేసుకొనే పరిస్థితి లేక ఇ బ్బందిపడుతున్నారు. కొంతమంది రైతులు రోడ్లు, పొలాల్లో టార్పాలిన్‌ పట్టలు వేసి నిల్వ చేశారు. ప్ర స్తుతం వాతావరణంలో జరుగుతున్న మార్పులతో ఎప్పుడు వర్షాలు పడతాయోనని భయాందోళన చెం దుతున్నారు. భారీ వర్షాల హెచ్చరికలతో రైతులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కనపర్తిలో రెం డు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. అందువల్ల ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆ యా ఆర్‌బీకేల ధాన్యం కొనుగోలు వేగవంతం చే యాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-19T00:25:17+05:30 IST