క్రీడలతో ఐక్యతను చాటాలి

ABN , First Publish Date - 2023-03-30T22:27:14+05:30 IST

గ్రామాల్లో వివిధ పండుగల సందర్భాల్లో జరిగే ఉత్సవాలు, క్రీడల్లో గ్రామప్రజలు ఐక్యతను చాటిచెప్పాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కోరారు.

క్రీడలతో ఐక్యతను చాటాలి
తనయుడు జయసింహారెడ్డితో కలసి పోటీలసు ప్రారంభిస్తున్న ఉగ్ర

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, మార్చి 30 : గ్రామాల్లో వివిధ పండుగల సందర్భాల్లో జరిగే ఉత్సవాలు, క్రీడల్లో గ్రామప్రజలు ఐక్యతను చాటిచెప్పాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కోరారు. నియోజకవర్గంలోని హనుమంతునిపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో శ్రీరామ నవమి సందర్భంగా తన తనయుడు జయసింహారెడ్డితో కలసి ఎడ్ల బండలాగుడు పోటీలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండ్ల జతలపై ఎక్కి తండ్రి, తనయులు పోటీలను ప్రారంభించిన తీరు చూపరులను అబ్బురపరచింది. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర తనయుడు జయసింహారెడ్డిని గ్రామస్థులు అభినందించారు. ముందు తరాలకు రాజకీయ మార్గదర్శకుడిగా ఎదగాలని గ్రామస్థులు ఆకాంక్షించి కరచలనాలు అందించారు. ఈసందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ పుట్టిన ఊరు, ప్రాంతంలో పండుగలు, వేడుకలు జరుపుకోవడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుంద్నన్నారు. పండుగలను గ్రామస్థులందరూ ఐక్యగా ఉండి నిర్వహించు కోవాలన్నారు. ఈ సమయాల్లో ప్రతి ఒక్కరూ రాజకీయాలను పక్కన పెట్టి, వేడుకల్లో పాల్గొంటే ఎంతో సంతోషమో తను మాటల్లో చెప్పలేనన్నారు. గ్రామాలే దేశాభ్యుదయానికి మూలాలని ప్రతి ఒక్కరూ గుర్తిస్తే బావుంటుందన్నారు. శ్రీరామ నవమి పండుగ వేడుకలు తన కుటుంబ సభ్యులతో కలసి, గ్రామస్థుల మధ్య చేసుకోవటం మరిచిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. ఇలాగే అందరూ ఐకమత్యంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానన్నారు. డాక్టర్‌ ఉగ్ర వెంట గ్రామస్థులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T22:27:14+05:30 IST