సచివాలయ కన్వీనర్లు సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2023-01-18T00:34:09+05:30 IST

నూతనంగా నియమించిన సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పురపాలకశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

సచివాలయ కన్వీనర్లు సమన్వయంతో పనిచేయాలి

త్రిపురాంతకం, జనవరి 17: నూతనంగా నియమించిన సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పురపాలకశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. స్థానిక ఆర్యవైశ్య అన్నసత్రం వద్ద మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందించే పథకాలతో పార్టీని సమన్వయం చేయాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడలని వలంటీర్లకు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, నాయకులు పోలిరెడ్డి, యల్లారెడ్డి, మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ముఖ్యమంత్రి జగన్‌ ఆధ్వర్యంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మండలంలోని మేడపి ఎస్సీ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వచ్చే చిన్నచిన్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు వి.కిరణ్‌, ఎంపీడీవో మరియదాసు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణ

త్రిపురాంతకం : మండలంలోని మేడపి ఎస్సీ కాలనీలో బీఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాన్ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంగళవారం ఆవిష్కరించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ దేశ ప్రజల అందరి సొత్తు అన్నారు. అంబేడ్కర్‌ స్ఫూర్తిని అందరికీ తెలిసేందుకు విజయవాడ స్వరాజ్య మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ఉడుముల శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్‌ గుమ్మా ఎల్లమ్మ, నాయకులు పోలిరెడ్డి, ఎల్లారెడ్డి, అంబేడ్కర్‌ యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:34:11+05:30 IST