శాస్త్రీయ ఆలోచనకు పదునుపెట్టాలి
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:43 AM
విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలకు పదును పెట్టాలని విద్యాశాఖ ఆర్‌జేడీ, డీఈవో వీఎస్ సుబ్బారావు అన్నారు.
ఆర్‌జేడీ సుబ్బారావు
మార్కాపురంలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
మార్కాపురం వన్‌టౌన్, డిసెంబరు 23: విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలకు పదును పెట్టాలని విద్యాశాఖ ఆర్‌జేడీ, డీఈవో వీఎస్ సుబ్బారావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జిల్లాస్థాయి విద్య,వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రేరణ కల్పించడానికి ఇటువంటి ప్రదర్శనలు తోడ్పడతాయన్నారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఏళ్ల తరబడి శాస్త్రజ్ఞులు శ్రమించి ప్రజలకు ఉపయోగపడే అనేక ఆవిష్కరణలు చేశారన్నారు. తొలుత వారు జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవోలు చంద్రమౌళీశ్వర్, అనితా రోజ్‌రాణి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, జిల్లా ఏఎంవో రమేష్, డీఎల్‌డీవో సాయికుమార్, ఎంపీడీవో చందన, ఎంఈవోలు రాందాస్ నాయక్, శ్రీనివాసులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
వైజ్ఞానిక ప్రదర్శన పోటీల్లో విజేతలను ఆర్‌జేడీ సుబ్బారావు ప్రకటించారు. వ్యక్తిగత విభాగంలో బేస్తవారపేట, సంతనూతలపాడు, కురిచేడుకు చెందిన విద్యార్థులు జి.శివకౌశిక్, డి.సాత్విక్, దేవరాజు ప్రథమ బహుమతి పొందారు. బేస్తవారపేట, రాచర్ల, పెద్దారవీడు పాఠశాలలకు చెందిన అభిరామ్, లక్ష్మీప్రియ, గౌతమి రెండో బహుమతి, గిద్దలూరు, కొత్తపట్నం, జరుగుమల్లికి చెందిన వసంత్‌కుమార్, నివాస్, రితీష్ మూడో బహుమతి పొందారు.
గ్రూప్ విభాగంలో : వై.పాలెం, మేడపి, దోర్నాలకు చెందిన జమీర్, మణికంఠ, వెంకట్, నరసింహ, శ్రావణి, శైలజ ప్రథమ.. ఈతముక్కల, గుంటుపల్లి, మార్కాపురానికి చెందిన విద్యార్థులు ధనలక్ష్మి, హారిక, నిఖిల్, శ్రీనివాసులు, వీరబ్రహ్మం రెండో బహుమతి పొందారు. అర్థవీడుకు చెందిన ఎం.అంజలి తృతీయ బహుమతి సాధించారు.
ఉపాధ్యాయుల విభాగంలో : ఒంగోలుకు చెందిన లక్ష్మీకాంతమ్మ, పెద్దారవీడుకు చెందిన ప్రమీల, ఈతముక్కలకు చెందిన కె.రాము ప్రథమ బహుమతి పొందారు. ఈదుమూడికి చెందిన కె.పద్మజ, స్వర్ణలత, యాచవరానికి చెందిన బాషాలు రెండో బహుమతి సాధించారు. తుమ్మలచెరువుకు చెందిన రాజగోపాల్, మర్రిపూడికి చెందిన ఉమామహేశ్వరి, తుమ్మకుంటకు చెందిన జి.ప్రభాకర్ మూడో బహుమతి పొందారు. ఎమ్మెల్యే, డీఈవోలు వీరికి బహుమతులు అందజేశారు.