నా కుమారుడిని కాపాడండి..

ABN , First Publish Date - 2023-06-01T01:58:27+05:30 IST

మరికొద్ది నెలల్లో డిగ్రీ పూర్తి చేసి చేతికి అందివస్తాడనుకున్న కుమా రుడు తీవ్రమైన వ్యాధికి గురికా వటంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

నా కుమారుడిని కాపాడండి..
బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న వరుణ్‌కుమార్‌

నిరుపేద తండ్రి వేడుకోలు

బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న కొడుకు

ఆర్థికసాయం కోసం అభ్యర్థన

ఒంగోలు (కల్చరల్‌), మే 31: మరికొద్ది నెలల్లో డిగ్రీ పూర్తి చేసి చేతికి అందివస్తాడనుకున్న కుమా రుడు తీవ్రమైన వ్యాధికి గురికా వటంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అంతగా ఆర్థిక స్థోమత లేని కుటుంబం వారిది. కుమారుడికి వచ్చిన వ్యాధికి వైద్యం చేయించాలంటే లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో దాతల సహాయం కోసం అభ్యర్థిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒంగోలు వీఐపీ రోడ్‌లో నివాసం ఉండే ముక్తినూతలపాటి వెంకటచలపతి స్థానిక గోపాల్‌నగర్‌లోని ఒక చిన్న దేవాలయంలో అర్చకునిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అతని కుమారుడు వరుణ్‌కుమార్‌ డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగా 2022లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వైద్యులకు చూపించగా బ్రెయిన్‌ ట్యూమర్‌ అని నిర్ధారించారు. దీంతో గత ప్రభుత్వంలో స్థానిక ఇందిరమ్మ కాలనీలో వెంకటాచలపతికి కేటాయించిన ఇంటిని అమ్మివేసి వైద్యం కోసం ఖర్చుపెట్టారు. అయితే కుమారుని పరిస్థితి మెరుగుప డకపోవటంతో మళ్లీ వైద్యులను సంప్రదించగా అతని తలలో నీరు చేరిందని ఓపెన్‌ సర్జరీ చేయాలన్నారు. అందుకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అంత స్థోమత లేని వెంకటాచలపతి ఆరోగ్యశ్రీ అధికారులను సంప్రదించగా ఓపెన్‌ సర్జరీ ఆ పథకం కిందకు రాదని వారు తిరస్కరించారు. దీంతో ఏమి చేయాలో పాలుపోని తండ్రి తన కుమారుడి వైద్యానికి సహాయం చేసి అతన్ని కాపాడాలని వేడుకుంటూ.. తమ పరిస్థితిని శనివారం ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తీసుకువచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వెంకటాచలపతి కుమారుడి వైద్యానికి సహాయం చేయదలచిన దాతలు సెల్‌ నెంబర్‌ 6305031763లో సంప్రదించాలని ఆయన కోరారు.

Updated Date - 2023-06-01T01:58:35+05:30 IST