సత్తాచాటిన పల్నాడు గిత్తలు

ABN , First Publish Date - 2023-02-18T00:20:51+05:30 IST

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పట్టణంలోని శ్రీపాతాళ నాగేశ్వరస్వామి దేవస్థానంలో శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలను నిర్వహించారు.

సత్తాచాటిన పల్నాడు గిత్తలు

గిద్దలూరు టౌన్‌, ఫిబ్రవరి 18 : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పట్టణంలోని శ్రీపాతాళ నాగేశ్వరస్వామి దేవస్థానంలో శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలను నిర్వహించారు. అందులో భాగంగా శుక్రవారం సీనియర్‌ విభాగం పోటీలను ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోటీల్లో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పోసానిపల్లె గ్రామానికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎడ్లు 3 వేల అడుగుల దూరం బండను లాగి మొదటి బహుమతి రూ.60వేలను సొంతం చేసుకున్నాయి. నంద్యాల జిల్లా జిల్లెలాపురం గ్రామానికి చెందిన భూమా గోవర్ధన్‌రెడ్డి ఎడ్లు 2780 అడుగుల దూరం బండను లాగాయి. రెండవ బహుమతి రూ.50వేలను గెలచుకున్నాయి. కడప జిల్లా పొద్దుటూరు మండలం చౌటుపల్లె గ్రామానికి చెందిన మార్తాల చంద్ర ఓబుల్‌రెడ్డి ఎడ్లు 2704 అడుగుల దూరం బండను లాగి మూడో బహుమతి 40వేలు గెలుచుకున్నాయి. అదే జిల్లాకు చెందిన కాశినాయన మండలం అనువారిపల్లె గ్రామానికి చెందిన శీలం జగన్‌మోహన్‌రెడ్డి ఎడ్లు 2612 అడుగుల దూరం బండను లాగి నాల్గవ బహుమతి 30వేలను సొంతం చేసుకున్నాయి. నంద్యాల జిల్లా బేతంచెర్ల గ్రామానికి చెందిన మేకల వెంకటరాముడు ఎడ్లు 2384 అడుగుల దూరం బండను లాగి ఐదవ బహుమతిని 20వేలు సొంతం చేసుకున్నాయి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానిపల్లె గ్రామానికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎడ్లు 2009 అడుగుల దూరం బండను లాగి ఆరవ బహుమతిని 10వేలు గెలుచుకున్నాయి. మొత్తం 9 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. శనివారం ఆరు పండ్ల విభాగంలో పోటీలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు కృష్ణచైతన్య, మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, కౌన్సిలర్లు గడ్డం భాస్కర్‌రెడ్డి, ముద్దర్ల శ్రీనివాసులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-18T00:20:54+05:30 IST