ట్రాఫిక్ సమస్యతో సతమతం
ABN , First Publish Date - 2023-08-25T00:44:19+05:30 IST
గిద్దలూరు పట్టణంలో రోజు రోజుకు జనాభా పెరుగుతుండడంతో అందుకు తగ్గట్టు వాహనాలు పెరుగుతున్నాయి
గిద్దలూరు, ఆగస్టు 24 : గిద్దలూరు పట్టణంలో రోజు రోజుకు జనాభా పెరుగుతుండడంతో అందుకు తగ్గట్టు వాహనాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లు రహదారుల విస్తర్ణ చేపట్టకపోవడంతో తరచూ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమోతోంది. ఆక్రమణలతో కుచించుకు పోతున్నాయి. పెరుగుతున్న ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లను పార్క్ చేసుకునేందుకు గిద్దలూరు పట్టణంలో మున్సిపల్ అధికారులు గాని, పోలీసులు గాని ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం లేదు. దాంతో ద్విచక్ర వాహన చోదకులు మోటార్ సైకిళ్ళను రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. చాలా వీధుల్లో ఆటోలు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంటున్నది. బ్యాంక్‌లు, విద్యాసంస్థలు సొంతంగా పార్కింగ్ కోసం స్థలాలు ఏర్పాటు చేయకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు ఖాతాదారులు వాహనాలను రోడ్లపై ఎక్కడపడితే అక్కడ నిలుపుతున్నారు. కళ్యాణ మండపాలకు కూడా పార్కింగ్ స్థలాలు లేక పెళ్ళిళ్ళు జరిగే సందర్భాలలో ఆయా వీధులన్నీ మోటార్ సైకిళ్ళు, కార్లలతో నిండిపోతుండడంతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంటున్నది. అలాగే వ్యాపార దుకాణాలు అధికంగా ఉండే పెద్దబజారు, స్టేషన్ రోడ్డులలో కూడా పార్కింగ్ స్థలాలు లేక కొనుగోలుదారులు రోడ్లపైనే మోటార్ సైకిళ్ళను పెట్టి వెలుతున్నారు. ప్రదానంగా ఇుకుగా ఉండే పోస్టాఫీసు రోడ్డులో పోస్టాఫీసు, బ్యాంక్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, జిరాక్స్ సెంటర్లు, హోటళ్ళు, అంగళ్ళు ఉండడంతో రోడ్లన్నీ పార్కింగ్‌గా మారుతుండడంతో కొన్ని సందర్భాలలో నడిచికూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంటున్నది. పెద్దబజారు, స్టేషన్ రోడ్డు, కాలేజీ రోడ్డు, కుమ్మరాంకట్ట రోడ్డు, క్లబ్‌రోడ్డు, గణేష్‌నగర్, నరవ రోడ్డు, కిష్ర్ణాథియేటర్ రోడ్డు తదితర ప్రాంతాలలో ఖాళీ స్థలాలను పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.